‘మిషన్ కర్మయోగి’కి మోదీ కేబినెట్ ఆమోదం - సివిల్ సర్వీసుల్లో భారీ ప్రక్షాళన
మిషన్ కర్మయోగి పేరిట సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు.
సివిల్ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని మంత్రి జవదేకర్ చెప్పారు. సివిల్స్ అధికారులు మరింత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా పనిచేసేలా వాళ్లను తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్ కర్మయోగిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అధికారులు మరింత ఉత్తేజంగా, సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ఈ కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు.

ప్రపంచంలో అత్యంత మెరుగైన విధానాలను అవలంభించడంతోపాటు భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగానూ అధికారులు తమ విధానాలను మెరుగుపర్చుకునేందుకు మిషన్ కర్మయోగి ఉపకరిస్తుందని జవదేకర్ అన్నారు.
మిషన్ కర్మయోగితోపాటు జమ్ముకశ్మీర్ అధికార భాషల బిల్లును కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమ్మూకాశ్మీర్ లో అధికార భాషలుగా ఉర్దూ, కశ్మీర్, డోగ్రీ, హిందీ, ఇంగ్లీష్ భాషలుగా ఉండనున్నాయి. మరోవైపు జపాన్, ఫిన్‌లాండ్, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి జవదేకర్ తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications