ఉద్యోగులకు ప్రభుత్వం దసరా స్పెషల్ గిఫ్ట్!
Union Cabinet: కేంద్ర సర్కారు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దుర్గా పూజ/దసరా పండుగ సందర్భంగా 10,91,146 మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ బుధవార ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1,865.68 కోట్ల నిధులను కేటాయించారు. ప్రతి సంవత్సరం దుర్గా పూజ/దసరా సెలవులకు ముందు అర్హత ఉన్న రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లిస్తారు. ఈ బోనస్ రైల్వే ఉద్యోగులను మరింత ప్రోత్సహించి, పనితీరును మెరుగుపరచడానికి ప్రేరణగా పనిచేస్తుంది. గతేడాది 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు రూ.2,028.57 కోట్ల బోనస్ చెల్లించారు.ఈ ఏడాది కూడా,10.91 లక్షల నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ లభిస్తుంది. అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951/- బోనస్ లభిస్తుంది.
ఎవరెవరికి వర్తిస్తుంది: రైల్వేల అద్భుత పనితీరు
ఈ బోనస్ వివిధ కేటగిరీల రైల్వే సిబ్బందికి వర్తిస్తుంది. ఇందులో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డ్), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌మ్యాన్, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర గ్రూప్ 'C' సిబ్బంది ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేల పనితీరు చాలా మెరుగ్గా ఉంది. ఓ పత్రికా ప్రకటన ప్రకారం, రైల్వేలు రికార్డు స్థాయిలో 1,614.90 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేశాయి. దాదాపు 7.3 బిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఈ అద్భుతమైన పనితీరును గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ఈ బోనస్‌ను ప్రకటించింది.

షిప్పింగ్ రంగానికి రూ.70,000 కోట్లు:
భారత ప్రభుత్వం షిప్పింగ్ రంగానికి కొత్త శక్తిని ఇవ్వడానికి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ రూ.70,000 కోట్ల విలువైన మూడు ప్రధాన పథకాలకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలతో షిప్పింగ్ పరిశ్రమ బలోపేతం కానుంది, అంతేకాకుండా ఉపాధి, పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరచుకోనున్నాయి.ప్రభుత్వం షిప్పింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ మూడు పథకాలను ఆమోదించింది. ఈ పథకాలతో నౌకల తయారీ నుంచి మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరుల వరకు మొత్తం వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సముద్ర అభివృద్ధి నిధి (Maritime Development Fund - MDF): ఇది ప్రధానంగా నౌకల కొనుగోలు, దేశీయ నౌకల తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన నిధి.
నౌకల తయారీ ఆర్థిక సహాయ విధానం (Shipbuilding Financial Assistance Policy): ఇది నౌకల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
నౌకల తయారీ క్లస్టర్ పథకం (Shipbuilding Cluster Scheme): ఈ పథకం నౌకల తయారీలో క్లస్టర్లను ఏర్పాటు చేసి, మొత్తం వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
VIDEO | Delhi: At a cabinet briefing, Union Minister Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) said, “The third decision taken today brings very good news for railway employees. The cabinet has approved a productivity-linked bonus. Under the Prime Minister’s leadership, a 78-day bonus… pic.twitter.com/VqPEDXHGnl
— Press Trust of India (@PTI_News) September 24, 2025
నిధుల కేటాయింపు, నిర్మాణం
ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.65,000 నుంచి రూ.70,000 కోట్ల వరకు ఆర్థిక సహాయానికి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సముద్ర అభివృద్ధి నిధి (MDF) లో ప్రభుత్వ వాటా 49 శాతం వరకు ఉంటుంది. మిగిలిన నిధులను పోర్ట్ అథారిటీలు, ప్రైవేట్ రంగం నుంచి సేకరిస్తారు. దీని ద్వారా ఈ పథకం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాలో ముందుకు సాగడంతో పాటు ఇది పెట్టుబడులను పెంచుతుంది.ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సముద్ర రంగానికి ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా రూ.25,000 కోట్ల సముద్ర అభివృద్ధి నిధి ఏర్పాటు ఓ కీలక ప్రకటన.
షిప్పింగ్ రంగంలో విప్లవం
మొత్తంగా, మోడీ ప్రభుత్వ ఈ నిర్ణయం షిప్పింగ్ రంగంలో ఒక విప్లవం తీసుకురావడానికి ఉద్దేశించిన ఒక కీలక అడుగు. ఈ పథకాలు భారతదేశపు షిప్పింగ్ పరిశ్రమకు కొత్త బలాన్ని ఇస్తాయి. దీనితో నౌకల తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది, దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి, అంతర్జాతీయ పోటీలో భారతదేశం ముందు ఉంటుంది. ఈ నిర్ణయంతో పాటు, క్యాబినెట్ బీహార్‌లో కొన్ని ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపిందని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యత లభించింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications