Waqf Bill: వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదు.. కాంగ్రెస్‌పై అమిత్ షా సీరియస్
వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వాదనల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.
"వక్ఫ్ చట్టం, బోర్డు 1995లో అమల్లోకి వచ్చాయని అమిత్ షా అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేరుస్తామని, వక్ఫ్‌లో జోక్సం చేసుకుంటామని కొందరు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు.. మొదటగా వక్ఫ్ బోర్డులో ఏ ముస్లిమేతరులు ఉండరని స్పష్టం చేశారు. అలాంటి ప్రొవిజన్ ఏదీ ఇందులో లేదు. అలా చేయాలని కూడా మేము కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ముస్లింల మత పరమైన కార్యక్రమాల్లో, వాళ్లు విరాళాలుగా ఇచ్చిన ఆస్తుల్లో జోక్యం చేసుకుంటామనేది కూడా పూర్తిగా అపోహే అని తేల్చిచెప్పారు. కేవలం ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి" అని అమిత్‌షా ఆగ్రహం వక్తం చేశారు.

అంతేకాకుండా, 2014 ఎన్నికలకు ముందు న్యూఢిల్లీలోని 123 వీఐపీ ఆస్తులను వక్ఫ్‌బోర్డుకు కాంగ్రెస్ పార్టీ డొనేట్ చేసిందని అమిత్ షా ఆరోపించారు. 2013లో కూడా వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా రైల్వే భూమిని వక్ఫ్‌కు డొనేట్ చేశారని ఆయన అన్నారు. 2013లో వక్ఫ్‌కు సవరణలు ప్రవేశపెట్టినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కఠినమైన చట్టాన్ని తాము కోరుకుంటున్నామని, దోపిడీలకు పాల్పడే వారికి జైలులో పెడతామని చెప్పారని, లాలూ ప్రసాద్ ఆకాంక్షలను ఇప్పుడు నరేంద్ర మోదీ నెరవేర్చనున్నారని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు, వక్ఫ్ సవరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఉద్దేశించబడిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో, వక్ఫ్ సవరణ బిల్లు రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications