ముస్లిం తండ్రికి, క్రైస్తవ తల్లికి పుట్టిన రాహుల్.. బ్రాహ్మణుడు ఎలా అవుతారు? డీఎన్ఏ టెస్ట్ చేయాలి

బెంగళూరు: తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే వ్యక్తిగా గుర్తింపు ఉన్న కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి నోటి దురుసును ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని హైబ్రీడ్ బ్రీడ్ గా అభివర్ణించారు. ముస్లిం తండ్రికి, క్రైస్తవ తల్లికి పుట్టిన బిడ్డ బ్రాహ్మణుడు ఎలా అవుతారని ప్రశ్నించారు అనంత్ కుమార్ హెగ్డే. ఈ వ్యాఖ్యానాలు కర్ణాటకలో దుమారాన్ని రేపుతున్నాయి.

సోమవారం కర్ణాటకలోని శిర్సి పట్టణంలో బీజేపీ కార్యకర్తలతో ఏర్పాటైన సమావేశంలో అనంత్ కుమార్ పాల్గొన్నారు. శిర్సి పట్టణం ఆయన స్వస్థలం. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ స్థానం నుంచి ఆయన నాలుగుసార్లు విజయం సాధించారు. నరేంద్రమోడీ మంత్రివర్గంలో నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు.

Union Minister Anant Kumar Hegde rakes up ‘Rahul hybrid breed’ row again

బీజేపీ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా అనంత్ కుమార్ ఈ వివాదాస్పద వ్యాఖ్యానాలను చేశారు. రాహుల్ గాంధీని హైబ్రీడ్ బ్రీడ్ గా అభివర్ణించారు. రాహుల్ తండ్రి ముస్లిం అని, తల్లి క్రైస్తవురాలు అని, వారిద్దరికీ పుట్టిన రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.

తాను కాశ్మీరీ బ్రాహ్మణుడినని, జందెం ధరిస్తానంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలను అనంత్ కుమార్ ఈ సందర్భంగా ఉటంకించారు. రాహుల్ ను బ్రాహ్మణుడిగా గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు చేయాలని అన్నారు. నేను జందెం ధరించే హిందువునని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఆయన (రాహుల్) హిందువు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా? అని హెగ్డే చెప్పారు. తాను ముస్లిం అని రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ స్వయంగా చెప్పారని అన్నారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులపై రాహుల్ గాంధీ సాక్ష్యాలు అడగటంలో అర్థమే లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+