కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత
Recommended Video

బెంగళూరు:కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకి సంబంధించిన క్యాన్సర్ వ్యాధికి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం అర్దరాత్రి దాటాక సుమారు 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన అనంతకుమార్ అక్టోబర్ 20 న ఇండియాకు తిరిగివచ్చారు. ఆ తరువాత బెంగళూరులోని శంకర్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అనంతకుమార్ 1959 జులై 22న బెంగళూరులో జన్మించారు. ప్రస్తుతం కర్ణాటక బీజేపీకి అధ్యక్షునిగా ఉన్న అనంతకుమార్ 6 సార్లు సౌత్ బెంగళూరు స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్ర మంత్రి పదవి చేపట్టారు.

అనంతకుమార్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. తొలుత 2014లో మోడీ మంత్రివర్గంలో అనంతకుమార్ ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2016లో మంత్రివర్గ విస్తరణలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలోనూ వాజ్‌పేయీ హయాంలోనూ అనంతకుమార్ విమానయాన శాఖ మంత్రిగా పనిచేయడం గమనార్హం.
అనంతకుమార్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ప్రజల జీవితానికి మరి ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు తీరని లోటుగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి మరణంపై సంతాపం వెలిబుచ్చారు. "నా విలువైన సహోద్యోగి మరియు స్నేహితుడు అయిన శ్రీ అనంత్ కుమార్ మృతి నాకు తీవ్ర విచారాన్ని కలుగచేసింది. ఆయన చిన్న వయస్సులోనే ప్రజాజీవితంలో ప్రవేశించి గొప్ప శ్రద్ధతో మరియు కరుణతో సమాజానికి సేవలను అందించిన గొప్ప నాయకుడు "...అని మోడి ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలాసీతారామన్ తదితరులు కేంద్ర మంత్రి అనంతకుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. అనంతకుమార్ కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications