సీఎం అభ్యర్థిగా క్యాప్టెన్: బంపర్ ఆఫర్ (ఫోటోలు)
చెన్నై: తమిళనాడులో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీఎండీకే అధినేత క్యాప్టెన్ విజయ్ కాంత్ పేరు ప్రకటించేందుకు ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు సిద్దం అయ్యారని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రితో సహ బీజేపీ నాయకులు విజయ్ కాంత్ తో సమావేశమై చర్చించారు.
డీఎండీకే నేత విజయ్ కాంత్ ఎన్ డీఏలోనే ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధకృష్ణన్ స్పష్టం చేశారు. ఎన్ డీఏ నుంచి విజయ్ కాంత్ బయటకు వెళ్లారని మీకు ఎవరు చెప్పారు అంటూ పొన్ రాధకృష్ణన్ మీడియాను ప్రశ్నించారు.
ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధకృష్ణన్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ కలిసి చెన్నైలోని విజయ్ కాంత్ ఇంటికి వెళ్లారు. తరువాత విజయ్ కాంత్ తోపాటు ఆయన భార్య ప్రేమలతా విజయ్ కాంత్ తో సుధీర్ఘంగా చర్చించారు.

అంటీఅంటనట్లు
లోక్ సభ ఎన్నికల సందర్బంలో విజయ్ కాంత్ బీజేపీతో కలిసి పని చేశారు. తరువాత బీజేపీ నాయకులతో అంటీఅంటనట్లు వ్యవహరించారు.

హామీలను విస్మరించిందని
లోక్ సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని బీజేపీ మీద విజయ్ కాంత్ అనేక సార్లు బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

డీఎంకే గాలం, డీసీఎం ఎర
ఈ నేపద్యంలో కరుణానిధి, స్టాలిన్ తదితరులు విజయ్ కాంత్ ను డీఎంకేలోకి లాక్కోవాలని ప్రయత్నించారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని విజయ్ కాంత్ కు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

వై.కో తదితరులు
తరువాత ఎండీఎంకే నేత వై.కో , వీసీకే, సీపీఎం, సీపీఐ తదితరులు విజయ్ కాంత్ తో కలిసి ప్రజాకూటమి ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నించారు.

సీఎం అభ్యర్థి మీరే
అందరితో చర్చించి సీఎం అభ్యర్థిగా విజయ్ కాంత్ పేరు ప్రకటిస్తామని వై.కో డీఎండీకే నాయకులకు సంకేతాలు ఇచ్చారు.

అన్ని వైపుల నుంచి బంపర్ ఆఫర్లు
తాను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో కలిసి పని చెయ్యనని విజయ్ కాంత్ పదేపదే చెప్పారు.

అమిత్ షా తో చర్చలు
తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి పని చెయ్యడం కంటే విజయ్ కాంత్ తో కలిసి పని చెయ్యడం మంచిదని బీజేపీ నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారు.

ఆచితూచి అడుగులు వేస్తున్నారు
విజయ్ కాంత్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పుడే ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోరాదని నిర్ణయించారు.

కచ్చితంగా సీఎం అవుతారు
విజయ్ కాంత్ మాతో కలిసి పని చేస్తే కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని తమిళనాడు బీజేపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications