పవన్ కూడా: మర్చిపోని బిజెపి!, అన్నమయ్య కీర్తన
విజయవాడ/గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన జవదేకర్ మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే కూటమితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బిజెపి, టిడిపి కూటమి విజయానికి పవన్ బాగా కృషి చేశారని కితాబిచ్చారు. ఈ గెలుపులో పవన్ చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నారు.

దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అభివృద్ధి చేస్తారన్నారు. తాము ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తామన్నారు.
ప్రమాణ స్వీకారంలో అన్నమయ్య సంకీర్తనలు
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వేదిక వద్ద సాంస్కృతి కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ గాయకులు మనో అన్నమయ్య సంకీర్తలు గానం చేశారు. అంతకుముందు మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం నాటకం ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications