కేక గురు: కేరళ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వన్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. అయితే కేరళ ముఖ్యమంత్రీ శ్రీ పన్నీర్ సెల్వం, ఆయన అధికార బృందంతో భేటీ అయ్యాను అంటూ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఓ ఫోటో .

న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రీ శ్రీ పన్నీర్ సెల్వం, ఆయన అధికార బృందంతో భేటీ అయ్యాను అంటూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణి, వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ట్వీట్ చెయ్యడంతో నెటిజన్లు బిత్తరపోయారు.

జయలలితకు వీరవిధేయుడైన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎప్పుడు కేరళ ముఖ్యమంత్రి అయ్యాడు దేవుడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి ట్వీట్టర్ లో ఈ విషయం చెప్పడంతో నెటిజన్లు తికమకపడుతున్నారు.

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వన్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. అయితే కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వన్ మాత్రం తానను కలిసింది కేరళ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటోతో పాటు ఈ విషయం పోస్టు చేశారు.

కేంద్ర మంత్రి అయి ఉండి రాంవిలాస్ పాశ్వన్ ఇలా పోరపాటు చెయ్యడంతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పోటీ పడుతున్నారా ? అంటూ ఒకరు, తనను కలిసింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలియకపోతే దేవుడు కూడా ఆయనను మార్చలేరని మరికోందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వన్ ఆ ట్విట్ డిలీట్ చేసి తనను కలిసింది కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని కరెక్ట్ పోస్టు పెట్టారు. అయినా ఆయన మీద సోషల్ మీడియాలో జోకులు మాత్రం పేలుతూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+