డ్యాన్స్‌తో దుమ్ములేపిన కేంద్రమంత్రి రామ్మోహన్.. సోషల్ మీడియాలో వైరల్!
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీగా సేవలందిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు.. డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో తన బంధువుల వివాహానికి హాజరైన మంత్రి.. వేదికపై ఉత్సాహంగా కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
రామ్మోహన్ నాయుడు.. బంధుమిత్రులతో కలిసి వేదికపైకి వచ్చి.. హుషారైన పాటకు చిందులు వేశారు. మొదట్లో కాస్త సిగ్గుపడినా.. ఆ తర్వాత వారితో కలిసి సరదాగా స్టెప్పులు వేశారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని పాటకు కాలు కదిపిన ఆయన.. వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక సామాన్య కుటుంబ సభ్యుడిగా ఇలా తన తన వారితో కలిసి సరదాగా పాల్గొనడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్..
ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకించి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫారాల్లో.. రామ్మోహన్ నాయుడు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, కూటమి నేతలు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.
స్టేజీపై కేంద్ర మంత్రి రామ్మోహన్ డాన్స్
— ChotaNews App (@ChotaNewsApp) July 29, 2025
AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్టేజీపై డాన్స్ అదరగొట్టారు. శ్రీకాకుళంలో జరిగిన తన బంధువుల వివాహంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి ఆయన స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/BZ4B5SGkdu
తన తండ్రి ఎర్రన్నాయుడు వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేతల్లో ముఖ్యమైన వారిగా మంచి ప్రజాదరణ పొందుతున్నారు.












Click it and Unblock the Notifications