Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Parents: కొడుకు కేంద్ర మంత్రి, ఎండలో కష్టపడుతున్న అమ్మానాన్న, ప్రియాంక ట్విట్ వైరల్, గ్రేట్ !

చెన్నై/ నామ్మక్కల్: కన్నబిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా, కొడుకులు కోట్ల రూపాయలు సంపాధించినా, రాజకీయంగా ఉన్నతస్థాయికి చేరినా కొందరు తల్లిదండ్రులు మాత్రం సామాన్య జీవితం గడపడానికే ఇష్టపడుతుంటారు. కొడుకు కేంద్ర మంత్రి అయినా ఆయన తల్లిదండ్రులు ప్రతిరోజు ఎండలో ఎండుతూ, వానకు తడుస్తూ వ్యవసాయం చేస్తూ వాళ్లు జీవించడానికి వాళ్లే డబ్బులు సంపాధించుకుంటున్నారు. కొడుకులు కౌన్సిలర్ అయితేనే నానా హంగామా చేసే కుటుంబ సభ్యులు మన కళ్ల ముందే ఉన్నారు.

Recommended Video

    Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu

    అయితే కేంద్ర మంత్రి తల్లిదండ్రులు ప్రతిరోజు వ్యవసాయం చేస్తూ కష్టపడి వారు జీవించడానికి వాళ్లే డబ్బులు సంపాధిస్తున్నారు. కొడుకు కేంద్ర మంత్రి అయినా ఆయన సహాయం లేకుండా కష్టపడి పని చేస్తున్న తల్లిదండ్రుల విషయం గురించి ఎంపీ ప్రియాంకా ట్విట్ చేశారు. కేంద్ర మంత్రి తల్లిదండ్రుల స్టోరీ హాట్ టాపిక్ అయ్యింది.

    ఓడినా కేంద్ర మంత్రి అయ్యాడు

    ఓడినా కేంద్ర మంత్రి అయ్యాడు

    తమిళనాడుకు చెందిన ఎల్. మురుగన్ ఇటీవల కేంద్ర మంత్రి అయ్యారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తూ ఆ రాష్ట్రంలో బీజేపీని భలోపేతం చెయ్యడానికి శక్తివంచనలేకుండా పని చేసిన మురుగన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే మురుగన్ నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మురుగన్ పనితీరును గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చారు.

    అమ్మానాన్న ఏం చేస్తున్నారంటే ?

    అమ్మానాన్న ఏం చేస్తున్నారంటే ?

    కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తల్లిదండ్రులు లోగనాథన్, వరుదమ్మాల్ దంపతులు తమిళనాడులోని నామక్కల్ జిల్లా కోనూర్ గ్రామంలో చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు లోగనాథన్, వరుదమ్మాల్ దంపతులు ఊరి బయట ఉన్న పోలంలోకి వెళ్లి పగలంతా కష్టపడి వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. ముందునుంచి లోగనాథన్, వరుదమ్మాల్ దంపతులు కష్టపడి పని చెయ్యడం అలవాటు చేసుకున్నారు.

    ఎండలో కష్టపడుతున్న కేంద్ర మంత్రి అమ్మానాన్న

    ఎండలో కష్టపడుతున్న కేంద్ర మంత్రి అమ్మానాన్న

    కొడుకు మురుగన్ కేంద్ర మంత్రి అయినా ఆయన తల్లిదండ్రులు లోగనాథన్, వరుదమ్మాల్ మాత్రం వారి జీవనశైలిని మార్చుకోలేదు. ఇప్పుడు కూడా ఉదయం నిద్రలేని పొలం దగ్గరకు వెళ్లి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి పని చేసి తరువాత ఇంటికి చేరుకుని వంట చేసుకుని తింటున్నారు. కేంద్ర మంత్రి మురుగన్ తల్లిదండ్రులు కోనూరు గ్రామంలో ఓ చిన్న ఇంటిలోనే ఇప్పటికి జీవనం సాగిస్తున్నారు.

    మేము ఇలాగే ఉంటాము

    మేము ఇలాగే ఉంటాము

    కొడుకు మురుగన్ కేంద్ర మంత్రి అయినా మీరు ఇంకా ఎందుకు ప్రతిరోజు ఎండకు ఎండి, వానకు తడిచి కష్టపడి పని చేస్తున్నారు అని మీడియా కేంద్ర మంత్రి మురుగన్ అమ్మ వరదమ్మాల్ ను ప్రశ్నించారు. మేము మొదటి నుంచి కష్టపడి వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నాము, ఇప్పుడు అలాగే ఉంటామని, మా కొడుకు కేంద్ర మంత్రి అయినందుకు చాలా సంతోషంగా ఉందని, నా కొడుకు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అని తాము ముందే ఊహించానని మురుగన్ తల్లి వరదమ్మాల్ అన్నారు.

    ఓపిక ఉన్నంతరకు కష్టపడుతాము

    ఓపిక ఉన్నంతరకు కష్టపడుతాము

    కొడుకు మురుగన్ కేంద్ర మంత్రి అయినా మా పద్దతి మేము మార్చుకోలేమని, మేము జీవించడానికి మేమే కష్టపడి సంపాధించుకుంటామని, ఒకరి మీద ఆధారపడటం మాకు ఇష్టం ఉండదని, ఓపిక ఉన్నంతవరకు పొలం పనులు చేస్తామని కేంద్ర మంత్రి మురుగన్ తల్లిదండ్రులు లోగనాథన్, వరదమ్మాల్ దంపతులు అంటున్నారు.

     దళిత కుటుంబం

    దళిత కుటుంబం

    కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ దళిత కులానికి చెందినవాడు. నామక్కల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన మురుగన్ చెన్నైలోని డాక్టర్ అంబేద్కర్ లా కాలేజ్ లో న్యాయశాస్త్రం పూర్తి చేశారు. కాలేజ్ లో విద్యాభ్యాసం చేసే సమయంలోనే మురుగన్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడిగా చురుకుగా పని చేశాడు.

    మంచి చాన్స్ చిక్కింది

    మంచి చాన్స్ చిక్కింది

    న్యాయవాది అయిన తరువాత మురుగన్ బీజేపీ నాయకులకు చెందిన అనేక కేసులు వాదించి ఆ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరికి మురుగన్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి పార్టీని భలోపేతం చెయ్యడానికి ప్రయత్నించారు. ఇటీవల తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మురుగన్ ఓడిపోయినా ఆయన మాత్రం నలుగురుని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని ఢిల్లీలోని పెద్దల దగ్గర గుర్తింపు తెచ్చుకుని కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు.

     ఎంపీ ప్రియాంకా ట్విట్ వైరల్

    ఎంపీ ప్రియాంకా ట్విట్ వైరల్

    కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తల్లిదండ్రులు లోగనాథన్, వరదమ్మాల్ ఇప్పటికే ప్రతిరోజు పొలంలో కష్టపడి పని చేస్తున్నారని తెలుసుకున్న శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఓ ట్విట్ చెయ్యడంతో వైరల్ అయ్యింది. హృదయాన్ని కదిలించే కథ, కొడుకు మురుగన్ కేంద్ర మంత్రి అయినా ఆయన తల్లిదండ్రులు ఇప్పటికి పొలం పనులు చేసి వారి కష్టం మీద వారు జీవించడం నిజంగా గ్రేట్, మురుగన్ తల్లిదండ్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్విట్ చెయ్యడంతో వైరల్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+