జయ ఆరోగ్యం: మాట్లాడకుండా వెళ్లిపోయిన వెంకయ్య, 135 మంది సంతకాలు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం అపోలో ఆసుపత్రిని సందర్శించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం అపోలో ఆసుపత్రిని సందర్శించారు.
వైద్యులను కలిసి జయ ఆరోగ్యం గురించి వాకబు చేసారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంకయ్య నాయుడు వచ్చాక కీలక ప్రకటన వస్తుందని అందరూ భావించారు. ఆ మేరకు ప్రచారం కూడా జరిగింది. కానీ వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.
జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద బారికేడ్లుతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, జయలలిత వారసుడిగా పన్నీరు సెల్వంకు పట్టం కట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పన్నీరు సెల్వంను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. 135 మంది ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంకు మద్దతుగా సంతకాలు చేశారని తెలుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications