బిల్ గేట్స్‌తో వెంకయ్య, బెదిరిస్తే పని జరగదు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ది సంస్ద శాఖ మంత్రి వెంకయ్య నాయుడితో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో సమావేశమయ్యారు. భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా బిల్ గేట్స్ సేవా కార్యక్రమాలు అద్బుతమని కొనియాడారు. భారత్‌లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ, బిల్ గేట్స్ భాగస్వామ్యంతో పారిశుద్ద కార్యక్రమాలు చేపడతామన్నారు.
దేశ వ్యాప్తంగా పారిశుద్ద్యంపై అవగాహన పెంచేందుకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక బిల్ గేట్స్ మాట్లాడుతూ పారిశుద్ద్యంపై ఆధునిక సాంకేతిక అంశంపై చర్చించామన్నారు. కేంద్ర పట్టణాభివృద్ది సంస్ద మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యంతో పారిశుద్ద్య కార్యక్రమాల్లో పాల్గోనబోతుండటం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్న కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌ఎల్డీ నేత అజిత్ సింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. కేంద్ర మంత్రిగా ఉండగా ప్రభుత్వం తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయకుండా ఒత్తిడి తెస్తున్నారంటూ అజిత్ సింగ్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన వెంకయ్య, ఎలాంటి బెదిరింపు ఒత్తిడిలు పని చేయవని అజిత్ సింగ్ పేరు ప్రస్తావించకుండా అన్నారు. అయితే, ఈ విషయంలో ఆయనపై ఎలాంటి రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ప్రశ్నే లేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో అజిత్ ఉంటున్న ఇంటిని చౌదరి చరణ్ సింగ్ స్మారక కేంద్రంగా ప్రకటించాలని ఆర్ ఎల్డీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. బంగ్లాను ఖాళీ చేయకపోవడంతో అజిత్ సింగ్, అజహారుద్దీన్ నివసిస్తున్న ఇంటికి నీరు, విద్యుత్ సరఫరాను కొన్ని రోజుల కిందట అధికారులు కట్ చేసిన విషయం తెలిసిందే.

బిల్ గేట్స్‌తో వెంకయ్య భేటీ
మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ తో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి సమావేశం ముగిసింది. కేవలం అర్థగంట పాటు జరిగిన ఈ భేటీలో దేశంలోని పారిశుద్ధ్య ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం, వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గేట్స్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.

బిల్ గేట్స్‌తో వెంకయ్య భేటీ
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్, పక్కనే ఆయన భార్య మిలిండా గేట్స్.

బిల్ గేట్స్‌తో వెంకయ్య భేటీ
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో కరచాలనం చేస్తున్న మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్.

బిల్ గేట్స్‌తో వెంకయ్య భేటీ
కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీతో కరచా��నం చేస్తున్న మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్, పక్కనే ఆయన భార్య మిలిండా గేట్స్.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications