ఏకంగా ఎన్ని స్కూల్స్ కు బాంబు బెదిరింపులు అంటే ?, ఇంటర్ పోల్ సహాయం కోరిన సిటీ పోలీస్ !
ఇటీవల పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు ఎక్కువగా రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. చెన్నైలోని 13 ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో పిల్లలను శుక్రవారం పాఠశాలలకు పంపించమని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. చెన్నైలోని ఐదు పాఠశాలలకు కొన్ని రోజుల క్రితం బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా 13 స్కూల్స్ కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంటనే పాఠశాలలకు వచ్చి పిల్లలను తీసుకెళ్లారు. అయితే ఆ స్కూల్ లోని పిల్లలు నేటికి బడికి రాని పరిస్థితి కనిపిస్తోంది. అన్నానగర్, జేజే నగర్, ప్యారిస్ కార్నర్, గోపాల్‌పురం, మైలాపూర్ సహా చెన్నైలోని ప్రముఖ ప్రాంతాల్లోని పాఠశాలలకు బాంబు బెదిరింపు సందేశాలు పంపారు. ఈ నేపథ్యంలో పాఠశాలల యాజమాన్యం, సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులు పాఠశాల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

ఈ ఘటనతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు పాఠశాలలకు చేరుకున్నారు. కొన్ని పాఠశాలలు తమ ప్రాంగణంలో విద్యార్థులకు తాత్కాలికంగా వసతి కల్పించాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే పాఠశాలల దగ్గరకు పరుగు తీశారు. గ్రేటర్ చెన్నై పోలీసులు, ప్రత్యేక బాంబు నిర్వీర్యదళం, డిస్పోజల్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించి సోదాలు నిర్వహించారు. బెదిరింపు ఇమెయిల్‌ల వెనుక ఉన్న నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసు అధికారులు తెలిపారు.
స్కూల్స్ లో ఎలాంటి బాంబులు చిక్కకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విచారణ ప్రక్రియలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాలని, దర్యాప్తుకు సహకరించాలని అధికారులు కోరారు. విద్యార్థులను ఇంటికి పంపించడానికే ఈమెయిల్ బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్స్‌ను పరిశీలించగా ఇది ఫేక్ బెదిరింపు అని నిర్ధారించామని పోలీసులు తెలిపారు. ఈ మెయిల్ పంపిన వ్యక్తి ఎవరనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఈమెయిల్ పంపించిన వ్యక్తిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రేమ్ ఆనంద్ సిన్హా తెలిపారు. ఉదయం పోలీసులకు ఈమెయిల్స్ గురించి సమాచారం అందిందని సిన్హా చెప్పారు. పాఠశాలల నుంచి సమాచారం లేక స్థానిక టీవీ ఛానళ్లలో వార్తలు చూసిన తల్లిదండ్రులు గోపాలపురం, మొగప్పైర్, పారిస్, అన్నానగర్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు పరుగులు తీశారు. తనిఖీ అనంతరం అది నకిలీ బాంబు బెదిరింపు అని తేలింది. నిందితులను గుర్తించేందుకు ఇంటర్ పోల్ పోలీసుల సహాయం తీసుకుంటున్నామని చెన్నైకి చెందిన ఓసీనియర్ పోలీసు అధికారి చెప్పారని తమిళ మీడియా తెలిపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications