ఉన్నావ్ రేప్: బిజెపి ఎమ్మెల్యేకు లైంగిక పటుత్వ పరీక్షలు?
లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్యేకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిని కోరుతున్నారు.
ఉన్నావ్ రేప్ కేసు ఘటనలో బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిబిఐ కస్టడీలో 12 రోజుల పాటు ఎమ్మెల్యే ఉన్నారు. కస్టడీ ముగియడంతో ఎమ్మెల్యేను శుక్రవారం నాడు కోర్టు ముందు హజరుపర్చనున్నారు.

అయితే ఈ సమయంలో బిజెపి ఎమ్మెల్యేకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు కోర్టుకు దరఖాస్తు చేయనున్నారు.విచారణలో ఎమ్మెల్యే సరైన సమాధానాలు చెప్పని కారణంగా సీబీఐ అధికారులు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఉన్నావ్ రేప్ కేసు ఘటనకు సంబంధించి యూపీ రాష్ట్రంలో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అలహబాద్ కోర్టు ఆగ్రహంతో సీబీఐ అధికారులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
గత ఏడాది జూన్‌లో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం నిరసనకు దిగింది.అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా తనపై బురద చల్లేందుకు ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆయన ఆరోపించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications