Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆమె పరిస్థితి విషమం.. ఇప్పుడే ఏం చెప్పలేం.. దిశ ఘటన మరవకముందే ఉన్నావ్‌లో మరో ఘటన

ఉత్తర ప్రదేశ్‌లో ఉన్నావ్ రేప్ బాధితురాలిపై నిందితులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. గత డిసెంబర్‌లో ఓ మహిళ అత్యాచారానికి గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా రాయ్ బరేలి కోర్టుకు గురువారం ఉదయం బాధితురాలు వెళ్తుండగా ఆ కేసు నిందితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. కిరోసిన్ పోసి తగులపెట్టడానికి ప్రయత్నించడంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే...

వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

ఉన్నావ్ రేప్ బాధితురాలిపై ఐదుగురు దాడి చేసి తగులపెట్టేందుకు ప్రయత్నించారు. కాలిన మహిళను ఉదయం 10 గంటలకు హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. దాంతో ఆమెకు 90 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యుల బృందం ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆమె పరిస్థితిని వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు అని శ్యాంప్రసాద్ ముఖర్జీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశుతోష్ దూబే వెల్లడించారు.

లక్నో నుంచి మరో నగరానికి

లక్నో నుంచి మరో నగరానికి

బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తాం. ఆమె ఆరోగ్యం సహకరిస్తే లక్నో నుంచి షిఫ్ట్ చేసి ఇతర నగరానికి మెరుగైన హాస్పిటల్‌కు తరలిస్తాం. ఎప్పుడు తరలిస్తామనే విషయంపై క్లారిటీ లేదు. వైద్యుల తమ శక్తి మేరకు శ్రమిస్తున్నారు అని దూబే పేర్కొన్నారు.

ఐదుగురి అరెస్ట్

ఐదుగురి అరెస్ట్

ఇదిలా ఉండగా, ఉన్నావ్ రేప్ బాధితురాలిపై దాడి జరగగానే ప్రత్యక్ష సాక్ష్యులు అందించిన సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొన్నారు. కాలిన గాయాలతో పడి ఉన్న బాధితురాలిని చికిత్స కోసం వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కిరోసిన్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బెయిల్‌పై వచ్చి నిందితుల దారుణం

బెయిల్‌పై వచ్చి నిందితుల దారుణం

ఉన్నావ్ రేప్ బాధితురాలిపై దాడి చేసిన ఐదుగురిని హరిశంకర్ త్రివేది, రామ్ కిషోర్ త్రివేది, ఉమేష్ బాజ్‌పాయ్, శివమ్, శుభమ్ త్రివేదిగా గుర్తించారు. వీరిలో శివమ్, శుభమ్ త్రివేది ఈ కేసులో ప్రధాన నిందితులు. వారిద్దరు బెయిల్‌పై ఇటీవల బయటకు వచ్చి మళ్లీ బాధితురాలిపై దాడికి ఒడిగట్టారు. హైదరాబాద్‌లో దిశ ఘటన మరవకముందే రేప్ బాధితురాలిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోసారి ఉన్నావో రేప్ ఘటన దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+