ఉన్నావో బాధితురాలిని ఎయిమ్స్‌కు తరలించలేం... ఎందుకో తెలుసా...?
ఉన్నావో అత్యాచార బాధితురాలి పరిస్థితి విషమంగా తయారైంది. ఆమేను ప్రస్థుతం చికిత్స పోందుతున్న లక్నో అసుపత్రి ఆసుపత్రి నుండి ఢిల్లిలోని ఎయిమ్స్‌కు తరలించలేని స్థితిలో ఉందని యూపి ప్రభుత్వం సుప్రిం కోర్టుకు వివరించింది. దీంతో బాధితురాలిని ఎయిమ్స్‌కు తరలించాలన్న ఉత్తర్వులను సుప్రిం కోర్టు వాయిదా వేసింది.

ప్రమాదానికి గురైన ఉన్నావో బాధితురాలు లక్నోలోని కేజీఎమ్‌యూ ఆసుపత్రిలో చికిత్సపోందుతుంది. అయితే ప్రమాదంపై విచారణ చేపట్టిన సుప్రిం కోర్టు బాధితురాలిని వెంటనే హెలికాప్టర్‌లో ఢిల్లి ఎయిమ్స్‌కు తరలించాని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాధితురాలు వెంటిలెటర్‌పై చికిత్స పోందడంతో విపరీతమైన జ్యరంతో బాధపడుతుందన్న నివేదికను సుప్రిం కోర్టుకు తెలిపింది. దీంతో బాధితురాలిని వెంటనే ఎయిమ్స్‌కు తరలించాలని ఇచ్చిన ఉత్తర్వులను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications