లాక్‌డౌన్‌పై రాహుల్ సంచలన కామెంట్స్- అనాలోచిత చర్యతో ఇప్పటికీ ఇబ్బందులే
కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. మార్చి 22న మొదలైన లాక్‌డౌన్ నెలల తరబడి కొనసాగింది. చివరకు ఆగస్టు తర్వాత వరుసగా అన్‌లాక్ పేరుతో క్రమంగా లాక్‌డౌన్ తొలగించారు. దీంతో లాక్‌డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ జనం ఆ తర్వాత ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాలఎన్నికల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
The unplanned lockdown disaster continues to haunt the country.
— Rahul Gandhi (@RahulGandhi) March 19, 2021
Condolences to the lakhs of families being punished with indescribable pain for GOI’s incompetence & myopia. pic.twitter.com/TBN7mS149W
దేశవ్యాప్తంగా అనాలోచితంగా, గుడ్డిగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. యునిసెఫ్ తాజాగా విడుదల చేసిన ఓ నివేదికపై మీడియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా అత్యధికంగా శిశు, మహిళా మరణాలు సంభవించిన దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. కేంద్రం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయంతో పేదలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రాహుల్ విమర్శించారు.

కేంద్రం అసమర్ధత కారణంగా ఇప్పటికీ లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని రాహుల్ గుర్తుచేశారు. లాక్‌డౌన్‌ను ఓ విపత్తుగా ఆయన అభివర్ణించారు. ఈ విపత్తు ప్రభావం దేశంపై ఇప్పటికీ ఉందన్నారు. లాక్‌డౌన్ కారణంగా తలెత్తిన ఇబ్బందులను తగ్గించడంలోనూ కేంద్రం విఫలమైందని రాహుల్ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ వలస కార్మికుల ఇబ్బందులను ప్రస్తావించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాహుల్ లాక్‌డౌన్ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications