Rekha:బాలీవుడ్ నటి రేఖ సహజీవనం చేసిన ఆ సెక్రటరీ ఎవరు..సంచలన విషయాలు..!
బాలీవుడ్ నటి రేఖ.. ఒకప్పుడు స్క్రీన్ పై కనిపిస్తే చాలు యువకులు కేరింతలు, ఈలలు కొట్టేవారు. ఆ అందానికి దాసోహం అయ్యేవారు. ఏడుపదుల వయసుకు దగ్గరలో ఉన్నప్పటికీ ఆ అందంను అలానే మెయిన్‌టెయిన్ చేస్తోంది రేఖ.ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలో నటించింది రేఖ. ప్రస్తుతం రేఖ చుట్టూ ఓ వివాదం నడుస్తోంది. ఇంతకీ ఏంటా వివాదం ఏమా స్టోరీ..?
బాలీవుడ్ నటి రేఖకు సంబంధించిన బయోగ్రఫీని రాశారు యూసర్ ఉస్మాన్ అనే వ్యక్తి. ఈ పుస్తకం పేరు రేఖ: ది అన్‌టోల్డ్ స్టోరీ (2016). ప్రస్తుతం ఈ పుస్తకం సంచలనంగా మారింది. ఇందుకు కారణం ఇందులో రేఖపై కొన్ని ఆసక్తి రేకించే అంశాలు దాగుండటమే. రేఖ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని రహస్యాలను యాసర్ ఉస్మాన్ తన పుస్తకంలో బహిర్గతం చేశారు.

రేఖ బెడ్‌రూంలోకి తన సెక్రటరీ తప్ప ఎవరికీ అనుమతి ఉండేదికాదని యాసర్ బయోగ్రఫీలో రాసుకొచ్చారు. ఆ సెక్రటరీనే రేఖకు సర్వస్వం అని చెప్పారు. ఒక కన్సల్టెంట్‌గా, ఫ్రెండ్‌గా, సపోర్టర్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సెక్రటరీ లేకుంటే రేఖ లేదనే అర్థం వచ్చేలా యాసర్ రాసుకొచ్చారు. ఇంతకీ ఆ సెక్రటరీ ఎవరనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. ఆ సెక్రటరీ పురుషుడు కాదు. ఫర్జానా అనే మహిళ. అవును ఫర్జానా సెక్రటరీగా రేఖకు వ్యవహరించారు. అయితే ఇంత చర్చ ఎందుకు అని మళ్లీ అనుమానం రావొచ్చు.
ఫర్జానా లేకుండా రేఖ ఉండేది కాదట. చాలా దగ్గరవారు ఈ విషయాన్ని చెప్పినట్లు పుస్తకంలో రాసుకొచ్చారు యాసర్. కొందరైతే ఫర్జానా అనే ఈ సెక్రటరీ రేఖ లవర్‌గా ఉండేదని కూడా చెప్పారట.పనిమనిషికి కూడా రేఖ బెడ్రూంలోకి అనుమతి లేదు కానీ, ఒక్క ఫర్జానాకు మాత్రమే అనుమతి ఉండేదట.ఇక రేఖకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఫర్జానానే చూసుకునేదట. ఆమె ఎవరితో మాట్లడుతుంది, ఎవరితో మాట్లాడకూడదు ఇవన్నీ ఫర్జానానే చెప్పేదట. రేఖ జస్ట్ తెరముందు మాత్రమే కనిపించేదని యాసర్ రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే రేఖ ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్‌ను 1990లో వివాహం చేసుకుంది. ముఖేష్ సొంతంగా స్థాపించిన కిచెన్‌వేర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా రేఖ వ్యవహరించారు. వీరిద్ధరూ కలవడానికి కారణం ఉమ్మడి స్నేహితురాలు బీనా రమణి అనే ఫ్యాషన్ డిజైనర్. ఇక ముఖేష్ వివాహమయ్యాక చాలారోజుల వరకు డిప్రెషన్‌లో ఉండేవాడట.పెళ్లి అయిన కొన్ని నెలలకే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో రేఖ లండన్‌లో ఉంది.
తన మరణానికి కారణం ఎవరూ కాదని సూసైడ్ లెటర్‌లో ముఖేష్ రాశారు. అయితే యాసర్ రాసిన బయోగ్రఫీలో మాత్రం ముఖేష్ మరణానికి కారణం రేఖ సెక్రటరీ ఫర్జానా అని ఉంది. దీంతో ఇది వివాదాస్పదమైంది. అంతేకాదు రేఖ తన కెరీర్‌లో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అమితాబచ్చన్‌తో ప్రేమ వ్యవహారం, భర్త చనిపోయాక నుదుటిపై బొట్టు ఇలా పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications