మెట్రో స్టేషన్ లో బాక్సుల కొద్దీ కండోమ్స్.. ప్రయాణికులు షాక్..!
దేశంలో మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోడ్లపై ట్రాఫిక్ కారణంగా గంటలకొద్దీ వేచిచూడాల్సి వస్తున్న క్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు మెట్రో రైలులోనే ప్రయాణం చేస్తుంటారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిత్యం వందల మంది ప్రయాణించే మెట్రో స్టేషన్ల వద్ద ఇలాంటి ఘటన జరగడంతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. దిల్లీలోని మెట్రో స్టేషన్ గేట్ వద్ద ఓ బాక్సులో కుప్పల కొద్దీ కండోమ్స్ బయటపడ్డాయి. దీంతో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
దిల్లీలోని మెట్రో స్టేషన్ లో బాక్సుల కొద్దీ కండోమ్స్ ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. మెట్రో స్టేషన్ గేటు వెనకాల ఓ బాక్సును గుర్తించాడు ఓ ప్రయాణికుడు. ఏంటని ఓపెన్ చేసి చూడగా బాక్సు నిండా కండోమ్స్ ఉన్నాయి. దీంతో అతడితోపాటు తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. వీటిని ఎవరు ఇక్కడ పెట్టారని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే గతంలో దిల్లీ మెట్రో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేసింది. అయితే తాజాగా ఈ ఘటన జరిగిన క్రమంలో ఆ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కండోమ్ బాక్సులను బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు.. ఇతర రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని విన్నాను.. అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరొకతను.. వీటిని నిజంగానే వినియోగిస్తారా..? అని కామెంట్ చేశాడు. నేను మెడికల్ స్టూడెంట్ ను. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రారంభించిన గొప్ప కార్యక్రమంగా దీన్ని భావిస్తాను. కానీ వీటిని ప్రజలు వినియోగిస్తారా..? లేదా..? అన్నది సందేహమే.. అని కామెంట్ పెట్టాడు. వీటిని ప్రభుత్వాసుపత్రికి అందించండి అని మరొక వ్యక్తి కామెంట్ పెట్టాడు.

2014 లో దిల్లీ మెట్రో సంస్థతో కలిసి నిరోధ్ అనే సంస్థ.. కండోమ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించింది. దిల్లీలోని అనేక మెట్రో స్టేషన్స్ లో కండోమ్స్ వెండింగ్ మెషీన్స్ ను ఏర్పాటు చేసింది. వీటితో వినియోగించిన కండోమ్స్ ను రీసైక్లింగ్ చేసి ఓరల్ కంట్రాసెప్టివ్స్.. శానిటరీ న్యాప్ కిన్స్ ను తయారీకి వినియోగించారు. నిరోధ్ కండోమ్స్ ను 1960 ల్లో వాడుకలోకి తీసుకొచ్చారు. సెక్సువల్లీ ట్రాన్స్ మిట్టెడ్ ఇన్ ఫెక్షన్స్ బారి నుంచి పడకుండా వీటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సెంటర్లలో వీటిని ఉచితంగా అందజేస్తున్నారు.












Click it and Unblock the Notifications