ఇలాంటి వార్తలు దర్యాప్తునకు అడ్డంకే: బీజేపీ కార్యకర్త అరెస్ట్ ప్రచారంపై ఎన్ఐఏ క్లారిటీ

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో తాజాగా ప్రచారం జరుగుతున్న ప్రచారంపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) స్పందించింది. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బీజేపీ కార్యకర్తను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు పలు టీవీ న్యూస్ ఛానళ్లు పేర్కొన్న నేపథ్యంలో ఎన్ఐఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వార్తలు విచారణకు అడ్డంకిగా మారతాయని పేర్కొంది. కాగా, అతడ్ని సాక్షిగా విచారించినట్లు సమాచారం.

'ధృవీకరించని వార్తలు ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తును అడ్డుకుంటున్నాయి' అని శుక్రవారం సాయంత్రం ఘాటుగా స్పందించింది. 'ఈ కేసులో సాక్ష్యాలు, సమాచారాన్ని సేకరించేందుకు ఎన్ఐఏ పరారీలో ఉన్న, అరెస్టు చేసిన నిందితుల కాలేజీలు, పాఠశాల సమయ స్నేహితులతో సహా పరిచయస్తులందరినీ పిలిపించి, విచారిస్తోంది' అని సెంట్రల్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

Unverified News Items Hamper Investigation NIA Following Reports Of Detaining BJP Worker In Rameshwaram Cafe Blast Case

'ఈ కేసు ఒక ఉగ్రవాద సంఘటన కావడం వల్ల, సాక్షుల గుర్తింపుకు సంబంధించిన ఏదైనా సమాచారం దర్యాప్తుకు ఆటంకం కలిగించడమే కాకుండా, వ్యక్తులకు సమన్లు ​​పంపబడే ప్రమాదం కూడా ఉంది. అలాగే, ధృవీకరించని వార్తల అంశాలు కేసులో సమర్థవంతమైన దర్యాప్తును అడ్డుకుంటున్నాయి. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడంలో అందరి సహకారం కావాలని ఎన్ఏఐ కోరింది.

బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడు సంభవించిందని.. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బెంగళూరు పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ప్రాథమిక దర్యాప్తు తర్వాత, దర్యాప్తును ఎన్‌ఐఎకు అప్పగించారు . ఈమేరకు చిక్కమగళూరులోని ఖల్సా నివాసి ముజమ్మిల్ షరీఫ్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది .

ఎన్ఐఏ ప్రకారం.. అనుమానిత బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, సహ-కుట్రదారు అబ్దుల్ మతీన్ తాహాకు లాజిస్టికల్ మద్దతు అందించిన షరీఫ్ కీలకమైన కుట్రదారు. కర్నాటకలోని 12 సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 18 చోట్ల ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి అరెస్టు చేశారు.

మార్చి 29న, 2019 నుంచి పరారీలో ఉన్న షాజిబ్, తాహాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. NIA ప్రకారం, షజీబ్ శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలోని మసీదు రోడ్డుకు చెందినవాడు. ఫిష్ మార్కెట్ రోడ్‌కు చెందినవాడు మతీన్. సొప్పు గుడే, తీర్థహళ్లి రూరల్. వీరంతా శివమొగ్గ ఐసిస్‌ మాడ్యూల్‌ హ్యాండ్లర్లుగా కూడా ఉండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+