ఉదయం హత్య చేశాడు: ఆ తర్వాత గ్రామస్తుల చేతిలో అంతమయ్యాడు
లక్నో: సోమవారం ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడ్ని స్థానికులు పట్టలేని ఆగ్రహంతో కొట్టి చంపేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యారు. పోలీసుల సమక్షంలోనే జరిగిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని నిందితుడు మొదట కాల్చి చంపేశాడు. స్కూటర్‌పై వచ్చిన అతడు వెంటనే కాల్పులు జరిపి అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇంటిపైకి ఎక్కిన అతడు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్పటికే అక్కడికి భారీగా జనం చేరుకున్నారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికీ.. నిందితుడ్ని పట్టుకున్న స్థానికులు అతనిపై ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. పోలీసులు ముందు లొంగిపోవాలని మొదట నిందితుడు భావించాడు. కానీ, స్థానికులు అతడ్ని పట్టుకుని కర్రలు, రాడ్లతో తీవ్రంగా కొట్టారు.
భారీగా జనం ఉండటంతో పోలీసులు కూడా వారిని అడ్డుకోలేకపోయారు. సోమవారం ఉదయం నిందితుడు గోరఖ్‌పూర్ నుంచి కుషీనగర్‌కు వచ్చి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications