2024 అధికారం డిసైడ్ అయ్యేది అక్కడే- అప్పుడే : యూపీలో ఏడు విడతల్లో పోలింగ్ - ఏం జరిగేను..!!
దేశంలో 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికార పీఠం దక్కేదెవరికి. దీనికి ముందు సెమీ ఫైనల్స్ కు నగారా మొదలైంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఏడు విడతల్లో ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల చేస్తారు. ఈ నెల 21వ తేదీ వరకు తొలి విడత కు సంబంధించిన నామినేష్లను స్వీకరిస్తారు.

వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇండికేటర్ గా
24న పరిశీలన.. 27వ తేదీ వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయం ప్రకటించారు. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం ఏడు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఏప్రిల్ 10న అయిదు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ ఫిబ్రవరి 14, మూడో విడత ఫిబ్రవరి 20, నాలుగో విడత ఫిబ్రవరి 23, అయిదో విడత ఫిబ్రవరి 27, ఆరో విడత మార్చి 3న, చివరిది అయిన ఏడో విడత మార్చి 7న పోలింగ్ జరగనుంది. ఇక్కడ అధికారంలోకి రావాలం టే మొత్తం 202 సీట్లలో విజయం సాధించాల్సి ఉంటుంది.

అధికార బీజేపీ సమర్ధతకు పరీక్ష
ప్రస్తుత శాసన సభ కాల పరిమితి మే 14వ తేదీతో ముగియనుంది. ఇక, ప్రస్తుత సభలో బీజేపీకి 325, సమాజ్ వాదీ పార్టీకి 47, బీఎస్పీకి 19, కాంగ్రెస్ కు ఏడు సీట్లు గత ఎన్నికల్లో గెలుపొందారు. 2017లోనూ యూపీలో ఏడు విడతల్లోనే ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 61.04 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో ముందుగానే ఉత్తర ప్రదేశ్ లో హోరా హోరీ పోరు మొదలైంది. ఇక్కడ సీఎం యోగీ వర్సెస్ ఇతర పార్టీల తరహాలో పరిస్థితి మారింది.
Recommended Video

కొత్త పొత్తులు.. బలాలు చాటే ప్రయత్నం
ప్రధాని మోదీ పలు మార్లు ఈ రాష్ట్రంలో పర్యటించటంతో పాటుగా అనేక డెవలప్ మెంట్ కార్యక్రమాలను ప్రారంభించి తమ నినాదం ఏంటనేది స్పష్టం చేసారు. అప్నా దళ్..నిషాద్ పార్టీతో బీజేపీ యూపీలో పొత్తు ఖరారు కానుంది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం ఈ ఎన్నికల పైన భారీ అంచనాలతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ..కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం సైతం తన బలం చాటుకొనే ప్రయత్నంతో సింగిల్ ఫైట్ తో బరిలోకి దిగుతోంది.












Click it and Unblock the Notifications