హోటల్ గదిలో నిర్బంధించి ఘాతుకం: మరో బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

లక్నో: అత్యాచార ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠితోపాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. బదోహీ పోలీసులు బుధవారం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను ఓ హోటల్‌లో బంధించి పలుమార్లు ఎమ్మెల్యే, అతని కుటుంబసభ్యులు లైంగికదాడికి పాల్పడ్డారంటూ ఫిబ్రవరి 10న బాధిత మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠితోపాటు మరో ఆగురురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... బదోహీ నియోజకవర్గ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ బాధిత మహిళ(40)పై అత్యాచారం చేశాడు.

 UP BJP MLA Ravindra Nath Tripathi Named In Rape Case

ఎమ్మెల్యేతోపాటు అతని మేనల్లుడు సహా మొత్తం ఏడుగురు హోటల్ గదిలో బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. 2017లో జరిగిన ఈ ఘటనపై బాధిత మహిళ ఫిబ్రవరి 10న పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడి విషయాన్ని బయటపెడితే చంపేస్తానని బెదిరించారని, అందుకే తాను ఈ ఇన్నాళ్లు బయటపెట్టలదేని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో తాను గర్భవతిని కూడా అయ్యాయనని, అయితే, తనకు బలవంతంగా అబార్షన్ చేయించారని బాధితురాలు వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ఏఎస్పీ రవీంద్ర వర్మకు అప్పగించామని ఎస్పీ తెలిపారు.

ఎమ్మెల్యేపై అభియోగాలు నిజమని తేలడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. బాధిత మహిళ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేసిన తర్వాత తదుపరి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే జైలుపాలవ్వగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా అదేబాటలో నడవడంపై విమర్శలకు తావిచ్చినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+