Viral Video: ప్రాణం తీసిన SIR-టార్చర్ తట్టుకోలేక మరో బీఎల్వో ఆత్మహత్య..!

కేంద్ర ఎన్నికల సంఘం దశాబ్దాల తరబడి చేయకుండా వదిలేసిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను తాజాగా ఆఘమేఘాల మీద నిర్వర్తిస్తుండటం క్షేత్రస్ధాయిలో అధికారులపై ఒత్తిడి పెంచేస్తోంది. ముఖ్యంగా గడువు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పాల్పడుతున్నారు. ఇలాంటిదే మరో ఘటన ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో బూత్ లెవెల్ అధికారిగా పనిచేస్తున్న 46 ఏళ్ల ఉపాధ్యాయుడు సర్వేష్ కుమార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నిర్ణీత గడువులోగా తన పరిధిలో ఉన్న ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేసేందుకు ఆయన్ను నియమించారు. దీంతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఈసీ చర్యలకు భయపడి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

UP BLO Takes Own Life Following Failure to Achieve SIR Target

ఇందులో బీఎల్వో సర్వేష్ కుమార్... తన కుటుంబ సభ్యుల్ని క్షమించాలని కోరారు. దయచేసి నా పిల్లలను చూసుకోవాలని అడిగారు. తాను ఈ ఎన్నికల విధుల్లో విఫలమయ్యానని తెలిపారు. తాను ఒక అడుగు కూడా ముందుకు వేయబోతున్నట్లు తెలిపారు. దానికి తాను మాత్రమే బాధ్యత వహిస్తానన్నారు. ఇందులో ఎవరి తప్పు లేదన్నారు. తాను చాలా బాధపడ్డానని, 20 రోజులుగా నిద్రపోలేకపోతున్నానని పేర్కొన్నారు.

UP BLO Takes Own Life Following Failure to Achieve SIR Target

తనకు సమయం ఉంటే, ఈ పని పూర్తి చేసి ఉండేవాడిని అన్నారు. తనకు నలుగురు చిన్న కూతుళ్లు ఉన్నారని, దయచేసి తనను క్షమించాలని సర్వేష్ కుమార్ ఈ వీడియోలో వేడుకున్నారు. తాను ఈ ప్రపంచానికి చాలా దూరం వెళ్తున్నానని కుటుంబానికి తెలిపారు. తాను జీవించాలనుకుంటున్నానని కూడా ఆయన చెప్పారు. కానీ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందన్నారు. దళిత వర్గానికి చెందిన బీఎల్వో మృతితో ఆయన స్వగ్రామం మొరాదాబాద్ లోని బహేండీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+