ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్ద పీట..నిరుద్యోగులకు గుడ్ న్యూస్

2023-24 ఉత్తర్ ప్రదేశ్ బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు యోగీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సారి యోగీ (Yogi Adityanath) సర్కార్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్‌గా అభివర్ణిస్తోంది.2023-24 ఉత్తర్ ప్రదేశ్ బడ్జెట్ (UP budget 2023) ప్రధానంగా మానవవనరులపైనే ఫోకస్ చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి సురేష్ కుమార్ ఖన్నా చెప్పారు.అంతేకాదు యువత,రైతులను మేలుచేసి వారిని బలోపేతం చేసే దిశగా బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు మహిళలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై దృష్టి సారిస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపడుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఉత్తర్ ప్రదేశ్‌ను సర్వోత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి సురేష్ ఖన్నా వెల్లడించారు. ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉత్తర్ ప్రదేశ్‌ను తీర్చి దిద్దాలనే లక్ష్యంతో యోగీ సర్కార్ పనిచేస్తోందని వెల్లడించారు. ఇక భద్రతా పరంగా యూపీ పురోగతి సాధించారని మంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్‌ ఎకానమీగా మారుతుందని ఇది ప్రధాని మోదీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని సీఎం యోగీ కొనియాడారు.

UP Budget 2023: Yogi Govt give lionshare to infrastructure in its budget,to create huge job opportunities

ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక వ్యక్తి తలసరి ఆదాయం జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.త్వరలోనే నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందుతుందని చెప్పిన యోగీ.. 94 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.ఇక 7వేల మంది ఏఎన్‌ఎంలకు, హోమ్ డిపార్ట్‌మెంట్‌లో 9వేల మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్‌ను ప్రభుత్వం మంగళవారం అందజేసింది.

ఎంఎస్‌ఎంఈలో గత ఆరేళ్లలో 1.61 కోట్ల ఉద్యోగావకాశాలు ఇచ్చినట్లు సీఎం స్పష్టం చేశారు. నిరుద్యోగిత రేటు 2016-17లో 19శాతం ఉండగా ఇప్పుడు అది 3శాతంకు పడిపోయిందని గుర్తు చేశారు. ఒకప్పుడు అభివృద్ధి అనేది నోయిడా ఘజియాబాద్‌ల వరకే పరిమితమయ్యేదని చెప్పిన యోగీ ఆదిత్యనాథ్... ఇప్పుడు తూర్పు ఉత్తర్ ప్రదేశ్‌లో దాదాపుగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.బుందేల్‌ఖండ్‌కు రూ.4.27 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.

తమ ప్రభుత్వం అభివృద్ధే మంత్రంగా దూసుకెళుతోంది కాబట్టే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు తమ రాష్ట్రానికి వస్తున్నాయని సీఎం యోగీ చెప్పారు. ఓ వైపు మానవవనరులను పెంచుకుంటూ పోతుండగా మరోవైపు క్రిమినల్స్‌ను అణిచివేస్తుండటంతోనే ఇన్వెస్టర్లు ఉత్తర్ ప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పారు. అయితే ఎలాంటి అజెండా లేని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకోలేవని యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+