యోగి ఈ రోజును ఇలా ప్రారంభించారు: 'ఆదిత్యనాథ్ నెగ్గుతారా'

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారాన్ని ఆవులకు తినిపించడం ద్వారా రోజును ప్రారంభించారు. యోగి తన నియోజకవర్గం (ఆయన ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీ) గోరఖ్‌పూర్‌లో ఉన్నారు.

ఆయన పశువుల పాక వద్దకు వెళ్లి ఆవులకు, లేగ దూడలకు ఆహారాన్ని తినిపించారు. అంతేకాదు, ఏ ఆవుకు అయితే ఆయన తినిపించారో ఆ ఆవు యోగిని గుర్తి పట్టిందట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. యోగి రావడం చూసి మరికొన్ని ఆవులు, లేగదూడలు ఆయన సమీపంలోకి వచ్చాయి.

ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. హిందువులు ఆవును పవిత్రంగా పూజిస్తారని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గోసంరక్షణశాలలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా యోగి తెలిపారు. యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గోసంరక్షణశాలలను, డెయిరీలను ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని యోగి చెప్పారు.

ఆవుల పెంపకం

ఆవుల పెంపకం

యోగి ముఖ్యమంత్రి కాకముందు గోరఖ్‌పూర్‌లో తన నియోజకవర్గంలోని తన ఆశ్రమంలో చాలా ఆవులను, లేగదూడలను ఆయన పెంచుతున్నారు. వాటికి స్వయంగా తినిపిస్తారు.

లక్నోకు ఆవుల తరలింపు

లక్నోకు ఆవుల తరలింపు

ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు చాలా ఆవులను లక్నోలో ఆయన ఉంటున్న 5 కాలీదాస్ మార్గ్ నివాసంలోకి తరలిస్తారని చెబుతున్నారు. ఆయన చాలా ఏళ్లుగా గోసేవలో ఉన్నారు.

అక్రమ గోవధశాలలపై చర్యలు

అక్రమ గోవధశాలలపై చర్యలు

యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాగానే తొలుత అక్రమ గోవధ శాలలపై చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా మారుతుంది. గతంలోనూ వీలుచిక్కినప్పుడల్లా యోగి గోసంరక్షణశాలలో ఉన్న ఆవులకు తానే తినిపించేవారు. కొన్ని ఆవులను పేర్లు పెట్టి మరీ పిలిచేవారు.

ఈవీఎంలపై అఖిలేష్..

ఈవీఎంలపై అఖిలేష్..

ఇదిలా ఉండగా, ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచనను ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ స్వాగతించారు.

గతంలో ప్రతిపక్ష నేతలు ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలిసిన నేపథ్యంలోనే ఈ మేరకు కదలిక వచ్చిందని అఖిలేష్ యాదవ్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగించడం లేదన్నారు. మరి భారత్‌లో ఎందుకు ఉపయోగిస్తున్నారన్నారు.

యోగి ఈ పరీక్షలో నెగ్గుతారా: అఖిలేష్

యోగి ఈ పరీక్షలో నెగ్గుతారా: అఖిలేష్

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పని చేస్తుందా, లేదా అన్నదే తాము ఎదురు చూస్తున్నామని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ పరీక్షలో యోగి ప్రభుత్వం నెగ్గుతుందా లేదో చూడాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
“Cows are also required in religious rituals of the Hindus. Cowsheds will be promoted in all the districts. The central government is also promoting cowsheds in UP and other states,” said Yogi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి