Yogi Adityanath: యూపీ పాలనలో తనదైన ముద్ర వేస్తున్న యోగి ఆదిత్యనాథ్..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో కీలక మార్పులు తీసుకొస్తున్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనదైశైలిలో దూసుకెళ్తున్నారు. భిన్నంగా ఆలోచిస్తూ ఉత్తర ప్రదేశ్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడు. తాజాగా పట్టణాల్లో ప్రజల నివాస అవసరాలకు అనుగుణంగా నిబంధనలు సవరించారు. యూపీలో రాజ్యాంగంలోని సెక్షన్ 42 ప్రకారం ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీల నుంచి భూమిని కొనుగోలు చేయాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. అయితే ఇక నుంచి ఎస్సీ ఎస్టీల నుంచి భూమి కొనుగోలు చేయడానికి కలెక్టర్ అవసరం లేదని నిబంధన మార్చారు. సెక్షన్ 42 లో యోగి ప్రభుత్వం మార్పులు చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ టౌన్‌షిప్ పాలసీ
ఉత్తరప్రదేశ్ టౌన్‌షిప్ పాలసీ-2023ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. కొత్త టౌన్‌షిప్ విధానం ప్రకారం, యుపీలో దళితులు, షెడ్యూల్డ్ తెగల భూమిని సేకరించడానికి ఇకపై కలెక్టర్ అనుమతి అవసరం లేదు. ఇదే కాకుండా 12.5 ఎకరాల స్థలంలో టౌన్‌షిప్ ఏర్పాటు చేయడానికి కూడా యోగి సర్కార్ అవకాశం కల్పించింది. టౌన్‌షిప్ ఏర్పాటుకు రిజిస్ట్రీపై 50% తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించింది.

హైటెక్ టౌన్‌షిప్
నిజానికి ఉత్తరప్రదేశ్‌లో హైటెక్ టౌన్‌షిప్ విధానం ముగిసింది. పాత విధానం ప్రకారం ఇంటిగ్రేటెడ్ పాలసీలో 500 ఎకరాలు, హైటెక్‌లో 1500 ఎకరాలు తప్పనిసరి. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం ప్రతిపాదిత విధానంలో 2 లక్షల లోపు జనాభా ఉన్న నగరంలో కనీసం 12.5 ఎకరాలు, ఇతర నగరాల్లో 25 ఎకరాల స్థలంలో కాలనీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వనున్నారు. కాలనీ లోపలికి వెళ్లాలంటే 24 మీటర్లు, 12 మీటర్ల రోడ్డు తప్పనిసరి నిబంధన చేర్చారు.

10 లక్షల జనాభా
ఉత్తరప్రదేశ్ లో క్రీడా సమూదాయాలు కూడా నిర్మించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అలాగే ఆయా నగరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాటు ఫిల్మ్ సిటీ, ఐటీ సీటీ, మెడిసిటీ, ఎడ్యూకేషన్ సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నోయిడా రోడ్లను రూపొందించిన విధంగా అన్ని నగరాలను రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.












Click it and Unblock the Notifications