మంటల్లో చిక్కుకున్న బైక్‌! ఛేజ్ చేసి కాపాడిన యూపీ పోలీస్! (వీడియో)

ఇటావా : భానుడు భగభగ మండుతున్నాడు. ఎండ వేడికి రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. యూపీలో ఇటావా హైవేపై పరిస్థితి అలాగే ఉంది. ఇంతలో ఓ మోటర్ బైక్‌ రివ్వున దూసుకుపోతోంది. బైక్‌పై భార్య, భర్త బిడ్డ ఉన్నారు. ఇంతలో అనుకోకుండా బైక్ మంటల్లో చిక్కుకుంది. ఆ విషయం వాహనంపై ఉన్నవారికి తెలియకపోవడంతో స్పీడుగా దూసుకెళ్తున్నారు.

దీంతో గాలికి మంట ఇంకా పెద్దదవుతోంది. ఇది గమనించిన హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. బైక్ వెనుక పరుగులు తీశారు. ఎట్టకేలకూ బైక్ పై ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడి పెను ప్రమాదం తప్పించారు.

UP cops chase down bike on fire, save lives of Three

ఉత్తర్‌ప్రదేశ్‌ ఇటావాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైలెన్సర్‌పై బట్టలు, ఇతర వస్తువులు ఉన్న బ్యాగులు ఉండటం, సెలెన్సర్ వేడెక్కడంతో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురిని కాపాడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. సకాలంలో స్పందించిన వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+