అక్కడే తప్పు: అఖిలేష్‌ను నిండా ముంచిన రాహుల్ గాంధీ!
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఫలితాల సరళిని చూస్తుంటే 250కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో ఎస్పీ ఓటమికి స్వయంకృపరాధమే అంటున్నారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఫలితాల సరళిని చూస్తుంటే 250కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో ఎస్పీ ఓటమికి స్వయంకృపరాధమే అంటున్నారు.
ముఖ్యంగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం పెద్ద మైనస్ అంటున్నారు. వరుసగా అన్ని రాష్ట్రాలలో ఓటమి చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి... ఇంకా చెప్పాలంటే యూపీలో ఏమాత్రం ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీతో జతకట్టి అఖిలేష్ యాదవ్ తన కొంప ముంచుకున్నారని అంటున్నారు.

అక్కడే పెద్ద పొరపాటు
403 అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీలో మేజిక్ ఫిగర్ 202. కాంగ్రెస్‌తో జత కట్టకపోయినా ఎస్పీకి ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు వచ్చేవని అంటున్నారు. ఆ పార్టీతో కలవడం వల్ల 100కు పైగా సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అందులో ఎస్పీ గెలిచే సీట్లు కూడా ఉన్నాయని అంటున్నారు. అక్కడే పెద్ద పొరపాటు జరిగిందని చెబుతున్నారు.
403 స్థానాలలో కనుక ఎస్పీ పోటీ చేస్తే ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చేవని, అలాగే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేదని అంటున్నారు.

ముందే కలిస్తే..
మరో విషయం కూడా గుర్తు చేస్తున్నారు. ఎగ్జిట్ ఫోల్ తర్వాత అఖిలేష్ స్పందిస్తూ.. మాయావతితో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆ కలిసేదేదో కాంగ్రెస్‌తో బదులు బీఎస్పీతో కలిస్తే బాగుండునని అంటున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత కూడా అఖిలేష్ ప్రతిపాదనపై మాయావతి స్పందించక పోవడం కూడా ఇక్కడ గమనించదగ్గ విషయం.

పలుచోట్ల డిపాజిట్లు గల్లంతు
ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీతో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇరు పార్టీలు కలిసి కూడా వంద సీట్లు గెలవలేకపోతోంది. దీనిని బట్టే కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు పెద్ద తప్పుగా అర్థమవుతోందని అందరూ అంటున్నారు.

రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే పెద్ద మైనస్ అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అది రుజువు అయిందని అంటున్నారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మునిగి... ఎస్పీని కూడా నిండా ముంచిందని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఇస్తే 11 సీట్లు మాత్రమే గెలుచుకునేలా ఉంది. ఓటు షేర్ కూడా 11 శాతంగా ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications