మోడీ, షా అండదండలు: యూపీ సీఎంగా తెరపైకి లక్నో మేయర్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారనే దానిపై ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారనే దానిపై ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురి పేర్లు బయటికి రాగా, ఇప్పుడు మరో నేత పేరు కూడా ముందుకు వచ్చింది. ఆయనే లక్నో మేయర్ దినేష్ శర్మ.
సీఎం రేసులో సాక్షి మహరాజ్, ఆదిత్యా యోగినాథ్, కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, మహేశ్ శర్మ, యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా, దినేష్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దినేశ్ శర్మ అత్యంత సన్నిహితుడు, నమ్మకస్థుడు కావడం గమనార్హం.

మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే లక్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ దినేష్ శర్మ పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి వివాదాలు లేకపోవడంతో పాటు ప్రతీ ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారనే మంచి పేరు కూడా ఉంది శర్మకు. అంతేగాక, దినేష్ శర్మపై స్థానిక నేతలకేగాక, ప్రజల్లోనూ అమితమైన నమ్మకం ఉండటం ఆయనకు మరో అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
పలు ప్రాంతాల్లో బీజేపీ ఇంఛార్జీగాను దినేష్ శర్మ పనిచేశారు. ఈ కారణాలన్నింటి వల్లే ఆయన సీఎం అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. కాగా, 'నేను కేవలం పార్టీ కార్యకర్తను మాత్రమే, సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది' అని దినేష్ శర్మ చెబుతుండటం గమనార్హం. కాగా, లక్నో నగరంలోని బీజేపీ శ్రేణులు ఇప్పటికే దినేష్ శర్మ సీఎం కావాలంటూ నినాదాలు చేస్తుండటం విశేషం. అయితే, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై యూపీ సీఎం ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications