దేశ భవితవ్యాన్ని చూపేది యూపీ ఎన్నికలే.. అఖిలేష్ గెలిస్తే గూండా రాజ్యమే : అమిత్ షా

ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా మధురలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డోర్ టు డోర్ ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈసందర్భంగా విపక్షాలపై విరుచుపడ్డారు. యూపీలో గుండా రాజ్యం రాకుండా ప్రజలు అడ్డుకోవాల‌ని పిలుపు నిచ్చారు..

దేశ భ‌విత‌వ్యాన్ని నిర్దేశించేది యూపీ ఎన్నిక‌లే..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే దేశ భవితవ్యాన్ని నిర్దేశిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో రెండవసారి బీజీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ లేకుండా భారత అభివృద్ధి అసాధ్యమని పేర్కొన్నారు. మధురలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన.. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాల‌ను ప్రజలకు వివరించారు. నాటి విపక్షాల పాలనకు నేటి యోగీ పాలనకు వ్యత్యాసాని ప్రజలు గుర్తించాలన్నారు. దేశాన్ని , రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

.అఖిలేష్ గెలిస్తే గూండా రాజ్యం

యూపీ ప్రజల నమ్మకం, అభిలాష ప్రకారం రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని అమిత్ షా అన్నారు. అందుకే మరోసారి బీజేపీకి అధికారం అప్పగించాలన్నారు. కాదని ఈ ఎన్నికల్లో సమాజావాదీ పార్టీని గెలిపిస్తే అఖిలేష్ యాదవ్ గూండా రాజ్యాం వస్తుందని అమిత్ షా విమర్శించారు. వారి పాలనలో చేసిన ఆగడాలు ప్రజలు ఇంకా మరిచిపోలేదంటూ ఆరోపణలు గుప్పించారు. చట్టం గురించి మాట్లాడుతున్న అఖిలేష్ యాదవ్.. కొద్దిగైనా సిగ్గుపడాలన్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజాం ఖాన్ అరెస్ట్ అయ్యారు. జైలులో ఉన్న ఆయనపై అనేక కేసులు ఉన్నాయని అమిత్ షా విరుచుకుపడ్డారు.

Recommended Video

    UP Assembly Elections 2022 : RPN Singh Joins In BJP | Oneindia Telugu

    వారసత్వవాదుల నుంచి విముక్తి

    ఒకప్పుడు యూపీని గూండాలు, నేరస్తులు ఏలేవారు అని అమిత్ షా ఆరోపించారు. మహిళలు, యువకులు ఓటు వేయడానికి కూడా భయపడేవాళ్లన్నారు. పోలీసులు సైతం వారికి భయపడేవారని విమర్శించారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. గూండాలు, నేరస్తులు పోలీసుల ముందుకు వచ్చి వారంతట వారే లొంగిపోతున్నారన్నారు. యూఫియా ముఠాలకు , రౌడీగాళ్లకు యోగి చెక్ పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లారని అన్నారు. యూపీలో వారసత్వవాదులు, కులవాదుల నుంచి విముక్తి చేశామని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+