వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె కోడలుగా వద్దు... నిత్యం వాట్సాప్ చూస్తోందని పెళ్లి వద్దన్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ పెళ్లి ఆగిపోయింది. ఇందుకు కారణం అందరికీ ఆశ్చర్యపరిచేలా ఉంది. పెళ్లి కూతురు ఎక్కువసేపు వాట్సాప్‌లో గడుపుతుందంటూ అబ్బాయి తరఫు వారు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నారు.

ఈ సంఘటన యూపీలోని అమ్రోహా జిల్లాలో జరిగింది. పెళ్లి కోసం వధువు, ఆమె తరఫు బంధువులు కూర్చున్నారు. వరుడు కోసం వేచి చూశారు. వరుడు, అతని తరఫు బంధువులు వచ్చారు. కానీ పెళ్లి చేసుకోవడం లేదని చెప్పారు. దీంతో పెళ్లి కూతురు తరఫు వారు ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటని అడిగారు.

పశ్చిమ బెంగాల్లో ఓ హోటల్లో నటి మృతదేహం: డిప్రెషన్‌లో ఉందా?పశ్చిమ బెంగాల్లో ఓ హోటల్లో నటి మృతదేహం: డిప్రెషన్‌లో ఉందా?

UP family calls off marriage on wedding day, says bride spends too much time on WhatsApp

దానికి అబ్బాయి తరఫు వారు చెప్పిన కారణం.. అమ్మాయి వాట్సాప్‌లో ఎక్కువ గడుపుతోందని. ఆమెకు వాట్సాప్ వ్యసనం ఉందని, అలాంటి కోడలు తమకు వద్దని చెప్పారు. వధువు, వరుడి తరఫు బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. వధువు తరఫు వారు పోలీస్ స్టేషన్ వెళ్లారు.

రూ.64 లక్షలు కట్నంగా అడిగారని, అది ఇవ్వనందున తమ కూతురుపై అభియోగాలు మోపుతున్నారని వాపోయారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English summary
In a bizarre incident, a family in Uttar Pradesh’s Amroha district called off a wedding, alleging that the bride spends excessive time on WhatsApp, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X