ఎమ్మెల్యే రేప్‌పై ఆధారాల్లేవు: యూపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ జోక్యం.. సీబీఐకి అప్పగింత

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: యూపీలోని ఉన్నవ్ అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పైన ఎలాంటి ఆధారాలు లేవని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. అందువల్లే ఆయనను అరెస్టు చేయలేదని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కేసును సుమోటోగా స్వీకరించారు.

గురువారం యూపీ ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ రాఘవేంద్ర సింగ్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని వివరించారు.

ఎఫ్ఐఆర్ నమోదయినప్పటికీ ఎమ్మెల్యే సెంగార్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసులో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.

ముందు అరెస్ట్ చేయండి, లేదంటే మా బాబాయిని కూడా చంపుతారు: ఉనావ్ రేప్ బాధితురాలు

UP govt says in HC that no proof of rape against MLA, CBI took over case after PMOs intervention

ఇప్పటికే విచారణ చేపట్టిన సిట్.. ఎమ్మెల్యే సెంగార్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభిస్తే ఆయనను అరెస్టు చేస్తామని కోర్టుకు తెలిపింది.

కాగా, ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తాను క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తనని సెంగార్ చెప్పారు. ఒకవేళ తనకు వారెంట్లు తనంత తానే పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పారు.

ప్రధాని జోక్యం

ఉన్నావ్ అత్యాచారం కేసులో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నదని తెలుస్తోంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అప్పగిస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Unnao rape case handed over to Central Bureau of Investigation upon Prime Minister's Office's (PMO) intervention: Sources.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X