పోర్న్ వీడియోలు చూసి చిన్నారిపై బంధువు అత్యాచారం -ఉలిక్కిపడ్డ నగరం..!!

నేరాలకు ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉత్తర్ ప్రదేశ్ మారుతోంది. రోజురోజుకూ ఆ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. చిన్నపిల్లాడి నుంచి పండు ముసలి వరకు వయస్సుతో సంబంధం లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడు ముక్కుపచ్చలారని 9 నెలల పసిబిడ్డపై అత్యాచారంకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Bihar Gang Rape:భర్తను బంధించి భార్యపై అత్యాచారం - ప్రైవేట్ పార్ట్స్‌లో..!!
Bihar Gang Rape:భర్తను బంధించి భార్యపై అత్యాచారం - ప్రైవేట్ పార్ట్స్‌లో..!!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 9 నెలల పసిబిడ్డ తన తల్లిపక్కన నిద్రిస్తుండగా 12 ఏళ్ల మైనర్ బాలుడు ఆ బిడ్డను అపహరించాడు. అనంతరం ఇంటి నుంచి కొంత దూరం తీసుకెళ్లి ఆ చిన్నారి పై అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ 12 ఏళ్ల బాలుడు బాధితురాలైన పసిబిడ్డకు చుట్టం అవుతాడు.అయితే ఘటన జరిగిన ముందు రోజున బాలుడు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపాడు. అంతేకాదు తన మొబైల్ ఫోన్‌లో పోర్నో సినిమాలు, కంటెంట్ ఎక్కువగా చూసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ చిన్నారిని అపహరించినట్లు తెలుస్తోంది.

UP Horror 12-Year-Old Boy Arrested for Alleged Sexual Assault on 9-Month-Old Infant in Gorakhpur

12 ఏళ్ల బాలుడి ఫోన్‌ను పోలీసులు తనిఖీ చేయగా అందులో 50కి పైగా పోర్న్ వీడియోల కోసం సెర్చ్ చేసినట్లు తన ఫోన్ హిస్టరీ చెబుతోంది.100కు పైగా పోర్న్ వెబ్ సైట్లను ఓపెన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ పోర్న్ సినిమాలు చూశాక అర్థరాత్రి 2 గంటల సమయంలో చిన్నారిని అపహరించి అత్యాచారం చేశాడని, ఇంటికి 500 మీటర్ల దూరంలో చిన్నారి రక్తస్రావం, నొప్పితో అల్లాడుతూ తల్లిదండ్రులకు కనిపించిందని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే చిన్నారిని చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా .. ప్రాథమిక చికిత్స అందిచిన వైద్యులు ఆ పై మెరుగైన చికిత్స కోసం BRD మెడికల్ కాలేజీకి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు.ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నివేదించారు.

బిస్కెట్ ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. రాజుకున్న రాజకీయ రచ్చ!
బిస్కెట్ ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. రాజుకున్న రాజకీయ రచ్చ!

ఇక బాలుడు మూడు రోజుల క్రితమే చండీగడ్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు వచ్చినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఇక బాలుడిపైనే అనుమానం ఉందని తెలపడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు.విచారణ సందర్భంగా బాలుడు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం మరింత బలపడటంతో వెంటనే తమ దైన స్టయిల్‌లో విచారణ చేయగా ఈ ఘోరానికి పాల్పడింది తానే అని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం బాలుడిని బాలనేరస్తుల జైలులో ఉంచారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరింత దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+