అర్ధనగ్నంగా పోలీస్‌స్టేషన్‌లో మహిళతో ఎస్ఐ మసాజ్!
లక్నో: బాధ్యత గల వృత్తిలో ఉండి.. ఏకంగా పోలీస్‌స్టేషన్‌నే మసాజ్ సెంటర్‌గా మార్చేశాడు ఓ ఇన్‌స్పెక్టర్. స్టేషన్‌లోనే మహిళతో మసాజ్ చేయించుకుంటూ కెమెరాకు చిక్కాడు. కాగా, ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దాయ్ జిల్లా కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న సంజయ్ యాదవ్ అర్థనగ్నంగా నేలపై కూర్చుని ఓ మహిళతో మసాజ్ చేయించుకున్నాడు. అంతేగాక, మరో వ్యక్తితో కాళ్లు పట్టించుకున్నాడు. పోలీస్‌స్టేషన్‌లోనే నడిచిన ఈ వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టారు.

ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఎస్సై నిర్వాకంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాయి. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలిని బెదిరించి ఎస్సై మసాజ్ చేయించుకున్నాడని ఆరోపించాయి.
కాగా, మసాజ్ చేస్తేనే ఫిర్యాదు తీసుకుంటానని ఎస్సై చెప్పడంతో బాధితురాలు మసాజ్ చేసిందని స్థానిక మీడియా పేర్కొంది. వెంటనే స్సందించిన డీజీపీ.. అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఎస్సై సంజయ్ యాదవ్ కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఆయనకు మసాజ్ చేసిన మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలు కాదని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు హర్దాయ్ ఎస్పీ తెలిపారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications