ఘోరం: బైక్‌పై గీతలు పడేశాడని అన్న చేతులు నరికేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన బైక్‌పై చిన్న గీత పడిందని సొంత అన్న చేతులు నరికేశాడు ఓ దుర్మార్గుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన బైక్‌పై చిన్న గీత పడిందని సొంత అన్న చేతులు నరికేశాడు ఓ దుర్మార్గుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. షామ్లి జిల్లాకు చెందిన అహ్మద్ ఇటీవల ఓ బైక్ కొనుకున్నాడు. మంగళవారం రాత్రి అహ్మద్ ఇంట్లో లేని సమయంలో అతని సోదరుడి మూడేళ్ల కుమారుడు బైక్‌పై ఆడుకుంటూ కూర్చున్నాడు. కాగా, అతను తిరిగి వచ్చేటప్పటికి బైక్‌పై గీతలు పడి ఉన్నాయి. దీంతో అహ్మద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

అదే కోపంలో చిన్నారిపై చేయిచేసుకోబోయాడు. ఇంతలో అతని సోదరుడు మహమ్మద్ అడ్డుపడడంతో కొడవలితో రెండు చేతులు నరికేశాడు. కాగా, మహ్మద్ భార్య వెంటనే భర్తను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది.
అప్పటికే మహమ్మద్ కుడి చేయి పూర్తిగా తెగిపోయింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహమ్మద్ భార్య.. అహ్మద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనను గమనిస్తే సొంత కుటుంబసభ్యుల కన్నా నిందితుడికి అతని వస్తువులే ఎక్కువ అనే విషయం అర్థమవుతోంది. వస్తువుల ప్రేమలో పడి అనుబంధాలను దూరం చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగిపోతుండటం ఆందోళన కలిగించే అంశమే.












Click it and Unblock the Notifications