Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిలాడీ పెళ్లికొడుకు! 6 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. లక్షల్లో కట్నం.. నాలుగో పెళ్లికి సిద్ధమవుతుండగా..!

సాధారణంగా పెళ్లి పేరుతో మోసాలు చేసే 'కిలేడీ పెళ్లికూతుళ్ల' గురించి వింటూ ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఓ కిలాడీ పెళ్లికొడుకు ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేవలం ఆరేళ్లలో ముగ్గురు మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకుని.. భారీగా కట్నకానుకలను గుంజి.. నాలుగో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రబుద్ధుడి లీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళలను రోడ్డున పడేసిన ఆ ప్రబుద్ధుడి లీలలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

అసలేం జరిగిందంటే?
యూపీలోని లలిత్‌పూర్ జిల్లాకు చెందిన సునీల్ కుమార్ ఈ ఘరానా మోసాలకు సూత్రధారి. సునీల్ కుమార్ తండ్రి రైల్వేలో గ్యాంగ్ మన్‌గా పనిచేస్తుండగా.. సునీల్ కుమార్‌కు మాత్రం ఎలాంటి స్థిరమైన ఉద్యోగం లేదు. అయినా కూడా తాను ఒక మంచి స్థానంలో ఉన్నానని, తనను పెళ్లి చేసుకున్నవారు అదృష్టవంతులని నమ్మిస్తూ.. ఝాన్సీ, లలిత్‌పూర్ ప్రాంతాల్లోని ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఓ పెళ్లి విషయం మరో భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

UP Marriage Scam Sunil Kumar Marries 3 Women in 6 Years for Dowry Caught Before 4th Marriage

ముగ్గురు భార్యలు.. ఒకే భర్త
ఈ ముగ్గురు బాధితులు కలిసి ఝాన్సీ ఎస్ఎస్‌పీ (SSP) కార్యాలయానికి చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. హిందూ సంప్రదాయం ప్రకారం 2019లో సునీల్ మొదటి వివాహం చేసుకున్నాడు. దాదాపు రూ. 8 లక్షల కట్నకానుకలు తీసుకున్నాడు. కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం వేధించి, ఆమెను పుట్టింటికి పంపేశాడు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి, 2021లో మరో గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈమె తల్లిదండ్రుల నుంచి కూడా రూ. 8 లక్షలు గుంజాడు. పెళ్లయ్యాక బుల్లెట్ బైక్, బంగారు గొలుసు కావాలని ఆమెను శారీరకంగా హింసించి బయటకు గెంటేశాడు. 2023లో మరో పెళ్లి చేసుకున్నాడు. ఈమె వద్ద నుంచి కూడా రూ. 8 లక్షలు వసూలు చేశాడు. ఈమె గర్భవతిగా ఉన్న సమయంలో వేధించి ఇంటి నుంచి పంపేశాడు. ప్రస్తుతం ఈమెకు ఒక కుమార్తె ఉంది.

నాలుగో పెళ్లికి ప్లాన్!
తమను మోసం చేసిన సునీల్.. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలుసుకున్న ముగ్గురు భార్యలు ఒక్కటయ్యారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని, సునీల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. ఝాన్సీలోని బాబినా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జె.పి. పాల్ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు మేరకు సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కేవలం పైపై మెరుగులు చూసి నమ్మకుండా.. అవతలి వ్యక్తి నేపథ్యాన్ని క్షుణ్ణంగా విచారించాలని ఈ ఘటన మనకు హెచ్చరిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+