యోగి ఆదేశించినా.. జిఎస్టీ అంటే ఏంటో చెప్పలేకపోయిన మంత్రి
'నాకు జిఎస్టీ (వస్తు, సేవల పన్ను) అంటే ఏమిటో తెలుసు, కానీ గుర్తుకు రావడం లేదు' ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి చెప్పిన సమాధానం.
లక్నో: 'నాకు జిఎస్టీ (వస్తు, సేవల పన్ను) అంటే ఏమిటో తెలుసు, కానీ గుర్తుకు రావడం లేదు' ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి చెప్పిన సమాధానం.
ఓ వైపు జిఎస్టిపై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు దానిపై అందరికీ వివరించాలని పార్టీ పెద్దలు సూచించారు.

కానీ, యూపీ మంత్రి రమాపతి శాస్త్రి అసలు జిఎస్టీ అంటే ఏమిటో చెప్పలేకపోయారు. జిఎస్టి విధానంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను రూపుమాపి, అవగాహన కల్పించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గ సభ్యులను ఆదేశించారు.
కానీ ఆయన మంత్రివర్గంలోని ఈ మంత్రి అసలు జీఎస్టీ అంటే ఏమిటో కూడా చెప్పలేకపోవడం గమనార్హం. పక్కన ఉన్న వాళ్లు జీఎస్టీని ఏమంటారో చెబుతున్నా.. సదరు మంత్రి దానిని అందుకోలేకపోయారు.
మంత్రి రమాపతి శాస్త్రి గురువారం మహారాజగంజ్ ప్రాంతంలో స్థానిక వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ ప్రాముఖ్యత గురించి వివరించబోయారు.
ఆ సమావేశానికి హాజరైన కొందరు జీఎస్టీ పూర్తి రూపం చెప్పాలని అడిగారు. అందుకు ఆయన తడబడుతూ చెప్పలేకపోయారు. అప్పటికీ పక్కన ఉన్న మరికొందరు ఆయనకు సమాధానాన్ని అందించే ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు మాత్రం అది అర్థం కాలేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications