ఘోరం: యువతిని తీసుకెళ్లాడని.. అతని తల్లిపై గ్యాంగ్‌రేప్

ముజఫర్‌నగర్: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయాడనే కోపంతో.. ఆ యువతి కుటుంబసభ్యులు.. ఆ యువకుడి తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని భోపురా గ్రామానికి చెందిన ఓ యువకుడు ముజఫర్‌నగర్‌కు చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతో నవంబర్‌ 20న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

 UP: Mother abducted, gangraped, after son elopes with accused family's daughter

అయితే ఈ విషయమై యువతి కుటుంబసభ్యులు యువకుడిపై కక్ష పెంచుకున్నారు. డిసెంబర్ 19న యువకుడి తల్లిదండ్రులతో పాటు సోదరుడు, బావను కిడ్నాప్‌ చేశారు. అనంతరం షామ్లీ ప్రాంతంలోని ఓ ఇంట్లో వారిని బంధించి హింసించారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు.. యువకుడి తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కిడ్నాప్‌ గురించి పోలీసులకు సమాచారం అందగానే.. వారు ఆ ఇంటిపై దాడి చేసి బాధితులను రక్షించారు. దీంతో ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో యువతి తండ్రి, ఇద్దరు సోదరులు, మాజీ సర్పంచిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+