నోయిడా-ఢిల్లీ రహదారిని తెరిచిన యూపీ పోలీసులు.. ఆ వెంటనే క్లోజ్, ఎందుకు తెలుసా..?
పౌరసత్వ సవరణ చట్టం సెగలు ఢిల్లీలో రాజుకుంటూనే ఉన్నాయి. షహీన్‌బాగ్, జమియా మిలియా వర్సిటీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఢిల్లీ కలింద్ కుంజ్‌ను కలిపే నోయిడా రహదారిని శుక్రవారం తెరిచారు. కలింద్ కుంజ్ తర్వాత గల్లీలో షహీన్‌బాగ్ ఉంటుంది. గత కొన్నిరోజులుగా ఆందోళన నేపథ్యంలో రహదారిని కొద్ది సేపు తెరిచి.. తర్వాత మూసివేశారు.
నోయిడా- ఢిల్లీ, ఫరీదాబాద్‌ను కలిపే మహమయ ఫ్లైఓవర్ వద్ద ఉన్న బ్యారికేడ్లను పోలీసులు తొలగించారు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే సమీపంలో ఓ బస్సు ఉండటం, ట్రాఫిక్ అంతరాయం కలగడంతో బ్యారికేడ్లను తీసివేసినట్టు తెలుస్తోంది. అక్కడినుంచి బస్సు వెళ్లిపోయాక.. తిరిగి బారికేడ్లను ఎప్పటిలాగే పెట్టి ఫ్లై ఓవర్ క్లోజ్ చేశారు.

షహీన్‌బాగ్, కలింద్ కంజ్ నుంచి కేవలం రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనే వాణిజ్య సముదాయాలు, గృహోపకరణాలకు సంబంధించిన షాపులు, రెస్టారెంట్లు ఉన్నాయి. షహీన్‌బాగ్ నుంచి ఉన్న రహదారి అట్లాంటా వాటర్ పార్క్‌తో ముగుస్తోంది. షహీన్‌బాగ్-కలింద్ కంజ్ రహదారిని నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేకి సమాంతరంగా ప్రజలు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా వాసులు ఎక్కువగా యూజ్ చేస్తారు.
Recommended Video

ఆందోళనకారులు మాత్రం షహీన్‌బాగ్-కలింద్ కంజ్ రహదారులను మాత్రమే ఎందుకు మూసివేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జీడీ బిర్లా రోడ్, కలింద్ కంజ్ బ్రిడ్జి, ఆమ్రపాలీ రోడ్, ఓక్లా బ్యారేజ్ రోడ్, ఓక్లా బర్డ్ సాంచురీ రోడ్, దాద్రీ మెయిన్ రోడ్, నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వే తెరిచారు కదా అని గుర్తుచేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications