బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆర్పీఎన్ సింగ్.. పిరికిపందలే అలా చేస్తారన్న కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థులను ప్రకటించి.. పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అటు ప్రధాన పార్టీలలో వలస జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ హస్తానికి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. నిన్నిటి వరకు సోనియా, రాహుల్ గాంధీలను ఆకాశానికి ఎత్తిన ఆర్పీఎన్ సింగ్.. కాషాయ కండువా కప్పుకున్న కొద్దిసేపటికే ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురించారు.

కాంగ్రెస్ పార్టీ మునుపటిలా లేదు..
ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆర్పీఎన్ సింగ్ చెప్పారు. యూపీ ప్రజలు తనను ఎప్పటి నుంచో బీజేపీలో చేరాలని కోరుతున్నారని.. ఇప్పటికి సాధ్యపడిందని పేర్కొన్నారు. తాను 32 ఏళ్లగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కానీ ఆపార్టీ మునిపటిలా ఇప్పుడు లేదని విమర్శించారు. యూపీ అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. శాంతి భద్రతలు మెరుగయ్యాయని యోగి సర్కార్‌పై ప్రశంసలు గుప్పించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తగా తన వంతు కృషి చేస్తాని ఆర్పీఎన్ సింగ్ తెలిపారు.

2బీజేపీలో సింగ్ చేరిక
ఆర్పీఎన్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ ప్రతినిధి శశివాలియా, పార్టీ కార్యదర్శి రాజేంద్ర ఆహ్వాన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సింగ్ చేరికను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. బీజేపీలో సింగ్ చేరికతో యూపీలో పార్టీ మరింత బలపడుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు. దేశం మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఆయన కొనియాడారు.

పిరికిపందలే అలా చేస్తారు..
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆర్పీఎన్ సింగ్‌పై హస్తం నేతలు తీవ్రంగా స్పందించారు. పిరికిపందలే విరుద్ధమైన భావజాలం ఉన్న పార్టీల్లో చేరతారంటూ ఆ పార్టీ జాతీయ ప్రతినిధి సుప్రియ శ్రినాటె విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య సిద్ధాంతపరమైన పోరాటం సాగుతుందన్నారు. ఈ పోరాటంలో గెలుపు సాధించాలంటే మనకు ధైర్యం, బలం ఉండాలన్నారు. కానీ కేవలం కొందరు పిరికిపందలే విరుద్ధమైన పార్టీల్లో చేరతానని ఆర్పీఎన్ సింగ్ పై మండిపడ్డారు. ఇంత కాలం పదవులు అనుభవించిన ఇప్పుడు పార్టీకి ద్రోహం చేశారని విమర్శలు గుప్పించారు.

4కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఆర్పీఎన్ సింగ్ పేరును కూడా ప్రకటించిన మరుసటి రోజే ఆయన పార్టీని వీడడం తీవ్ర చర్చనీయాంశమైంది. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. తన రాజకీయ ప్రయాణం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని సింగ్ ట్విట్ చేశారు. ఎన్నికల సమయంలో ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications