సహోద్యోగి భార్యను అభ్యంతరకరంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్: అరెస్ట్
లక్నో: తన సహోద్యోగి భార్యను అభ్యంతరకరమైన రీతిలో వీడియో చిత్రీకరణ చేయడమే కాక, అది చూపి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలి తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో చోటు చేసుకుంది. నిందితుడు ఓ ఆర్మీ అధికారి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. నవీన్ సింగ్ బిస్త్ అనే కానిస్టేబుల్ ర్యాంకు ఆర్మీ అధికారిని లక్నో కంటోన్మెంట్‌లోని వైర్‌లెస్ సిగ్నల్స్ దగ్గర నియమించారు.

నవీన్ సింగ్ తన సహోద్యోగి అయిన మరో ఆర్మీ అధికారి భార్యను రహస్యంగా అభ్యంతర రీతిలో తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోని చూపిస్తూ గత కొంతకాలంగా ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
దీంతో బాధిత మహిళ తన భర్తకు విషయం చెప్పి, అతని సహాయంతో ఎస్‌టిఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications