వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:పంతులమ్మ ఏందిదీ.. కంట్రీ మేడ్ తుపాకీతో సంచారం.. చివరికీ ఇలా..

|
Google Oneindia TeluguNews

ఆమె పాఠాలు చెప్పే పంతులమ్మ.. కానీ నాటు తుపాకీతో మరీ తిరుగుతుంది. విషయం తెలిసిన పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమెను తనిఖీ చేయగా దేశీయ తుపాకీ లభించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటన ఉత్తర ప్రదేశ్ మొయిన్‌పురిలో జరగగా.. పంతులమ్మను ఖాకీలు పకడ్బందీగా అరెస్ట్ చేశారు. కానీ ఆమె వారికి సహకరించింది. ఆ సమయంలో అక్కడున్న వారు మాత్రం కాస్త ఆందోళనకు గురయ్యారు.

 టీచర్ జేబులో గన్

టీచర్ జేబులో గన్

ఫిరోజాబాద్‌లో కరీష్మ సింగ్ యాదవ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. నిన్న పని మీద మెయిన్ పురికి వచ్చారు. అయితే ఆమె ప్యాంట్ జేబులో తుపాకీ ఉండటం కలకలం రేగింది. గన్ తీసుకొని వస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు రంగంలోకి దిగారు. ఇంకేముంది ఆమెను కొత్వాలీ ఏరియాలో
చుట్టుముట్టారు. మహిళ కానిస్టేబుల్ ఆమెను జీన్స్ జేబులో చేయి పెట్టి మరీ గన్ తీశారు. దీనిని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.

జనం రద్దీ..

జనం రద్దీ..


కరీష్మ యాదవ్ జేబు నుంచి 315 బోర్ కంట్రీ మేడ్ పిస్టోల్ తీసుకున్నారు. ఆ సమయంలో జనం చాలానే ఉన్నారు. అయినా కరీష్మ వారికి పూర్తిగా సహకరించింది. కరీష్మపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. మొయిన్ పురి పోలీసులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏం చేస్తారు.. తుపాకీ ఎందుకు ఉంది.. తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

ఎవరీతో సంబంధం

ఎవరీతో సంబంధం


కానీ టీచరమ్మ తుపాకీ తీసుకొని రావడంతో ఉత్కంఠ రేగింది. ఆమె ఎందుకు తుపాకీ తెచ్చుకుంది. పనిచేసే చోట కాక మెయిన్ పురి ఎందుకు వచ్చింది. మావోయిస్టులతో సంబంధం ఉందా..? లేదంటే మరే గ్రూపుతో క్లోజ్‌గా ఉంటున్నారా అనే చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే అన్నీ సశేష ప్రశ్నలే. ఏ కొశ్చన్‌కు ఆన్సర్ లేదు. పోలీసుల విచారనలో నిజ నిజాలు తేలాల్సి ఉంది. కానీ పంతులమ్మ మాత్రం హల్ చల్ చేశారు. పిస్టోల్ పట్టుకొని బహిరంగంగా సంచరించారు.

English summary
teacher Karishma Singh Yadav was arrested in Uttar Pradesh's Mainpuri on Tuesday after being caught with a country-made pistol, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X