16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి సోషల్ మీడియాలో..
నవ భారతంలో జరుగుతున్న లైంగికదాడులు ఆందోళన కలిగిస్తోన్నాయి. ఒంటరిగా మహిళ ఉంటే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. మరికొందరు వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జరిగిన అనర్ధాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోతున్న యువతులు .. అల్లరి మూకలు చేష్టలతో విసిగిపోతున్నారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

సాముహిక లైంగికదాడి
యూపీలోని కౌశంబి జిల్లాకు చెందిన ఓ యువతి తన కుటుంబంతో కలిసి ఉంటుంది. వారికి పశువులు ఉండటంతో గడ్డి తీసుకొచ్చేందుకు వెళుతుంటుంది యువతి. అలా ఆదివారం కూడా గడ్డి తీసుకొచ్చేందుకు బయల్దేరింది. కానీ ఆమెకు ముగ్గురు అల్లరి మూకలు ఎదురుపడ్డారు. మహ్మద్ నజీం, మహ్మద్ చోట్కా, బడ్కా అనే ముగ్గురు ఎదురుపడి .. ఆటకాయించారు.

పంజరంలో చిక్కిన చిలుకలా ..
వారి బారి నుంచి తప్పించుకునేందుకు యువతి విఫలయత్నం చేసింది. కానీ వారు మాట్లాడుతూనే యువతిని .. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను మిగతా వారు వీడియో తీశారు. ఆ యువతి అరుపులు, కేకలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. ఆ వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశారు సైకో మృగాళ్లు.

రగిలి.. ఊగిపోయి.. దాడి
విషయం తెలుసుకున్న యువతి గ్రామస్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. సమయం కోసం ఎదురుచూశారు. నజీం అండ్ కో గ్రామస్తులకు దొరికారు. ఇంకేముంది చేతులకు పని చెప్పారు. పంట చేలల్లోనే పడేసి చావగొట్టారు. అయితే మరో ఇద్దరు వారి బారి నుంచి తప్పించుకోగలిగారు. కానీ నజీం ఒళ్లు మాత్రం హునమైపోయింది. అతనిపై దాడి చేసే సమయంలో తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అతని చొక్క నలిగిపోయి .. అచేతనంగా నజీం పడి ఉన్నాడు.

అన్నదమ్ములే ..
మరో ఇద్దరు మహ్మద్ చోట్కా, బట్కా పరారీలో ఉన్నారు. వీరిద్దరూ అన్నదమ్ములు అని స్థానికులు చెప్పారు. సాముహిక లైంగికదాడి జరిగిన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడున్న ఇద్దరు సిబ్బంది తమతో అనుచితంగా ప్రవర్తించారని బాధితులు వాపోయారు. తొలుత కేసు నమోదు చేసేందుకు కూడా అంగీకరించలేదని పేర్కొన్నారు. కానీ ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎట్టకేలకు కేసు ఫైల్ చేశారు.

రంగంలోకి ఐదు బృందాలు
మహ్మద్ చోట్కా, బట్కా సోదరుల కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వారిని పట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. లైంగికదాడికి గురైన యువతికి వైద్య పరీక్షలు కూడా చేయించామని పోలీసులు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఈ ముగ్గురిపై కేసు నమోదు చేస్తామన్నారు. తప్పు చేసినవారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు ప్రయాగ్‌రాజ్ జోన్ సీనియర్ పోలీసు అధికారు సుజీత్ పాండే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications