అక్కడేమో స్టార్.. ఇక్కడేమో దొంగతనాలు..!
లక్నో : అక్కడేమో స్టార్‌గా వెలుగొందుతున్నాడు.. ఇక్కడేమో చోరీలు చేస్తున్నాడు. అద్భుతమైన డ్యాన్సులతో వేలాది మంది అభిమానుల మనసు దోచిన ఆ స్టార్.. ఇళ్లల్లో చొరబడి నగదు గట్రా దోచేస్తున్నాడు. చాలా ఈజీగా చోరీలు చేస్తూ తన స్టార్‌డమ్‌తో పోలీసులకు దొరికిపోను అనుకున్నాడో ఏమో గానీ చివరకు మాత్రం అడ్డంగా బుక్కయ్యాడు.
ఉత్తర ప్రదేశ్ పోలీసులకు టిక్ టాక్ స్టార్ చోరీ కేసులో పట్టుబడటం చర్చానీయాంశంగా మారింది. ఓ దొంగతనం కేసులో అతడిని పట్టుకొచ్చి లోపలేశారు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా లోని గ్రేటర్ నోయిడాలో ఇటీవల వరుస చోరీలు జరుగుతుండటం పోలీసులకు సవాల్‌గా మారింది. ఏ కోణంలో చూసినా నిందితుల ఆచూకీ దొరక్కపోవడం పోలీసులకు తలనొప్పైంది. దాంతో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. దాంతో టిక్ టాక్ స్టార్ నేతృత్వంలోని దొంగల ముఠా గుట్టు రట్టైంది.

టిక్ టాక్ స్టార్‌గా షారూఖ్ అనే యువకుడు చాలా ఫేమస్ అయ్యాడు. తనకు టిక్ టాక్ యాప్‌లో దాదాపు 40 వేల మంది వరకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అతడు చేసే డ్యాన్సులను ఆ యాప్‌లో అప్‌లోడ్ చేస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే స్టార్‌డమ్ ఉంది కదా.. తాను ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడో ఏమో గానీ మొత్తానికి చోరీల బాట పట్టాడు. దొంగల ముఠాకు నాయకత్వం వహించి బాగానే దోచినట్లు స్థానిక పోలీసుల ద్వారా తెలుస్తోంది.

టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న షారూఖ్ అడ్డ దారులు తొక్కడం చర్చానీయాంశమైంది. మొత్తానికి పోలీసుల వలకు చిక్కడంతో దొంగగా ముద్రపడి కటకటాలు లెక్కిస్తున్నాడు. వీరి గ్యాంగ్ నుంచి ఒక బైకుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, మూడున్నర వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో తన నేరాలను అంగీకరించాడు షారూఖ్. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications