షాక్: లైంగిక వాంఛ తీర్చనందుకు ప్రియురాలిని రెండో అంతస్థునుండి తోసేశాడు
లైంగిక వాంఛ తీర్చనందుకుగాను 20 ఏళ్ళ ఓ యువతిని ఆమె ప్రియుడు ఇంటిలో నుండి రెండో అంతస్థు నుండి తోసేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
ముజఫర్ నగర్: లైంగిక వాంఛ తీర్చనందుకుగాను 20 ఏళ్ళ ఓ యువతిని ఆమె ప్రియుడు ఇంటిలో నుండి రెండో అంతస్థు నుండి తోసేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షామిల్స్ జిల్లా కించనా నగరంలో ఈ ఘటన శనివారం నాడు జరిగింది. బాధితురాలికి వేరే వ్యక్తితో ఆమె కుటుంబసభ్యులు వివాహన్ని నిశ్చయించారు.

అయితే దీన్ని నిందితుడు వ్యతిరేకించాడు. అంతేకాదు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి బాధితురాలు సహకరించలేదు. ఆగ్రహం చెందిన నిందితుడు బాధితురాలిని పథకం ప్రకారంగా రెండో అంతస్థు నుండి కిందకు తోసేశాడు.
కుటుంబసభ్యులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టామని పోలీసులు ప్రకటించారు. నిందితుడి త్వరలోనే పట్టుకొంటామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications