తుపాకీలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పట్టుబడ్డ యూపీవాసులు (ఫోటో)

హైదరాబాద్: నకిలీ లైసెన్సులతో ఆయుధాలను తీసుకొని నగరానికి వచ్చిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని సికింద్రాబాదు రైల్వే పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రెండు తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పొలాల్లోకి జంతువులు రాకుండా ఉపయోగించే రెండు డబుల్‌ బ్యారెల్‌ తుపాకీలు, పది బుల్లెట్లతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సికింద్రాబాద్‌ రైల్వే డీఎస్‌పీ మురళీధర్‌, రైల్వే ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయుల కథనం ప్రకారం.. బీహార్‌ అలహాబాద్‌ తానే గ్రామానికి చెందిన సుగ్రివ్‌ కుమార్‌(36), దన్‌వీర్‌సింగ్‌ (48) పుణేలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీకి సంబంధించి రెండు డబుల్‌ బ్యారెల్‌ తుపాకీలను పొలాలకు జంతువులు రాకుండా ఉండేందుకు ఉపయోగిస్తున్నారు. జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో వీరు పారిపోయేందుకు పథకం వేశారు.

పుణే నుంచి పది బుల్లెట్లు, రెండు డబుల్‌ బ్యారె క్స్‌ తుపాకీలు విడి భాగాలుగా చేసి బ్యాగులో పెట్టి శనివారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌ ప్రధాన ద్వారం వద్ద లగేజీ స్కానర్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులకు వీరిపై అనుమానం వచ్చింది. వారి బ్యాగును లగేజీ స్కానర్‌ యంత్రంలో పెట్టారు.

UP youths held with guns at Secunderabad station

స్కానర్‌లో శబ్ధం వచ్చి దానికి అనుసంధానంగా ఉన్న కంప్యూటర్‌లో తుపాకీలు ఉన్నట్లు చూపించడంతో అప్రమత్తమైన కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాము పని చేసిన కంపెనీ నుంచి తమకు జీతాలు రాకపోవడంతోనే ఇక్కడకు చేరుకున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌ నుంచి ఈ నిందితులు ఎక్కడికి వెళుతున్న విషయం తెలియాల్సి ఉందని తెలిపారు.

రెండు డబుల్‌ బ్యారెల్‌ తుపాకీలకు నిందితులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. బీహార్‌లో తయారైన ఈ రెండు డబుల్‌ బ్యారెల్‌లు ఉత్తరప్రదేశ్‌లోనే ఉపయోగిస్తారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో నిషేధించారని డీఎస్పీ తెలిపారు.

నగరంలో ఏదైనా కంపెనీలో సెక్యూరిటీగార్డులుగా పని చేసేందుకు ఇక్కడికి వచ్చినట్టు చెప్పారని, ఇక్కడ తుపాకీలు ఉపయోగించుకునేలా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తీసుకొచ్చారని చెప్పారు. లైసెన్స్‌ తుపాకీలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం వల్లే అరెస్టు చేశామని చెప్పారు. వారు నకిలీ లైసెన్సులతో గార్డులుగా పని చేయాలనుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+