UPSC Civil Services Result: సివిల్స్ తుది ఫలితాల విడుదల-దుమ్మురేపిన తెలుగు తేజాలు..!

అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్షలో ఎంపికైన 1009 మంది అభ్యర్ధుల పేర్లను వెబ్ సైట్ లలో పీడీఎఫ్ రూపంలో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి పలు ప్రతిష్టాత్మక కేంద్ర సర్వీసుల్లో ఎంపిక కోసం నిర్వహించే సీఎస్ఈ పరీక్షలో భాగంగా 1056 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 1009 మంది మాత్రమే తుది జాబితాకు ఎంపికయ్యారు. వీరి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. లో అందుబాటులో ఉంచారు. వీరికి మెరిట్ ఆధారంగా వివిధ అఖిల భారత సర్వీసుల్లో నేరుగా అపాయింట్ మెంట్లు లభించబోతున్నాయి.

UPSC civil services results released- here is how to check

ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. గతేడాది జూన్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. సెప్టెంబర్ 20-29 వరకూ మెయిన్స్ నిర్వహించారు. అలాగే ఈ ఏడాది జనవరి 7 నుంచి 17వ తేదీ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో అఖిల భారత స్ధాయిలో టాపర్ గా శక్తి దూబే నిలిచారు. హర్షిత గోయల్ కు రెండో ర్యాంక్ లభించింది. తెలుగు అభ్యర్ధి సాయి శివానికి 11వ ర్యాంక్ దక్కింది.

యూపీఎస్సీ క్యాంపస్‌లోని పరీక్షా హాల్ దగ్గర ఫెసిలిటేషన్ కౌంటర్ అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ పరీక్షలు లేదా నియామకాలకు సంబంధించిన ఏదైనా సమాచారం లేదా స్పష్టతను పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య స్వయంగా లేదా 23385271, 23381125 మరియు 23098543 నంబర్లలో టెలిఫోన్ నంబర్ ద్వారా పొందవచ్చు.ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి 15 రోజుల్లోపు మార్కులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని యూపీఎస్సీ తెలిపింది.

ఈసారి సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటాయి. ఎట్టబోయిన సాయి శివానికి 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్‌ 15వ ర్యాంకు సాధించారు. అలాగే అభిషేక్‌ శర్మకు 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డికి 46వ ర్యాంకు, శ్రవణ్‌కుమార్‌ రెడ్డికి 62వ ర్యాంకు దక్కింది. వీరితో పాటు సాయి చైతన్య జాదవ్‌కు 68వ ర్యాంకు, ఎన్‌ చేతనరెడ్డికి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేష్‌ రెడ్డికి 119వ ర్యాంకు వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+