యూపీఎస్సీ మెయిన్ పరీక ఫలితాలు విడుదల: జాబితా చూసుకోండి ఇలా
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీఎస్సీ ఫలితాను సోమవారం విడుదలయ్యాయి.
పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు.

ఆ తర్వాత సెప్టెంబర్‌లో యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. త్వరలో నిర్వహించే ఇంటర్వ్యూల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర (గ్రూప్-ఎ, గ్రూప్-బీ) సర్వీసులకు ఎంపిక అవుతారు.
సివిల్ సర్వీసెస్ ఇంటర్య్వూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://upsconline.nic.in/WR-CSM-24-RollList-Engl-091224.pdf












Click it and Unblock the Notifications