యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్: 16ఉద్యోగాలకు అప్లై చేయండి
హైదరాబాద్: యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 16 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 5 లీగల్ ఆఫీసర్లు, 4 పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర పోస్టులున్నాయి. ఉద్యోగార్థులు మార్చి 29, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: లీగల్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఖాళీల సంఖ్య: 16
జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా.
చివరి తేదీ: మార్చి 29, 2018

జీతం వివరాలు:
లీగల్ ఆఫీసర్: రూ. 67,700 - 2,08,700/-
పబ్లిక్ ప్రాసిక్యూటర్: రూ. 56,100 - 1,77,500/-
విద్యార్హత: లీగల్ ఆఫీసర్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ లా లేదా ఇంటర్నేషనల్ రిలేషన్ లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లాలా డిగ్రీ పొంది ఉండాలి.
వయో పరిమితి: 01.03.2018 నాటికి లీగల్ ఆఫీసర్ అభ్యర్థులు 40ఏళ్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థులు 35ఏళ్లు.
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 29.03.2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications